ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు నెలలు. దేశంలో మరే ప్రజా సమస్యకు ఇంత సుదీర్ఘ కాలంపాటు ప్రముఖ టీవీ ఛానళ్లు ఫోకస్ చేయలేదేమో? పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. మహేశ్ కత్తి నడుమ మొదలైన రచ్చకు చర్చతో అంతకంతకూ హీట్ జనరేట్ చేయటం తెలిసిందే. అంత పెద్ద పవన్ దిగి వచ్చి తనకు సారీ చెప్పాలంటూ మహేశ్ కత్తి మొదలెట్టిన మాటల యుద్ధానికి పలు ఛానళ్లు దన్నుగా నిలిచాయి.
నిత్యం గంటల తరబడి పవన్ అభిమానుల పేరుతో కత్తి మహేశ్ చేసిన విమర్శలు.. మధ్య మధ్యలో కాలర్స్ వేసే క్వశ్చన్స్ తో ఇష్యూను ఎంతలా పొడిగించవచ్చో ఈ ఎపిసోడ్ అందరికి అర్థమయ్యేలా చేసింది. ఒకదశలో ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్లనుంది? ఎంత కాలం కొనసాగనుంది? లాంటి ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పలేని పరిస్థితి. ఇదిలా ఉంటే.. కత్తి మహేశ్ ఎపిసోడ్ పై పవన్ క్యాంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటమే కాదు.. మీడియా సంస్థలపైనా సీరియస్ గా ఉందని చెబుతారు. అయితే.. తామేమీ చేయలేని పరిస్థితుల్లో ఉండటం.. ఏం చేసినా అదో పెద్ద రార్ధాంతం కావటం ఖాయమన్న భావనతో కామ్ గా ఉన్నట్లు చెబుతారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఛానల్ లో సాగే చర్చ కోసం కారులో వెళుతున్న తన మీద కోడిగుడ్లతో దాడి జరిగిందంటూ మహేశ్ కత్తి చేసిన ఆరోపణలు.. దానికి వెంటనే ఓయూ విద్యార్థుల సంఘాలు కొన్ని దన్నుగా నిలుస్తామంటూ ప్రకటనలు చేశాయి. ఇప్పటివరకూ పవన్ అభిమానుల పేరుతో పవన్ పై కత్తి యుద్ధం చేస్తుంటే.. దానికి ఓయూ విద్యార్థి సంఘాలు కొన్ని జత కలవటంతో.. విషయం మరింత ముదిరిపోతుందన్న భావన వ్యక్తమైంది. ఇలాంటి వేళ అనూహ్యంగా పవన్ పార్టీకి చెందిన నేతలుగా చెప్పే కొందరు సీన్లోకి వచ్చేసి.. ఇష్యూను సెటిల్ చేసేందుకు ప్రయత్నాలు షురూ చేశారు.
నెలల తరబడి సాగిన డ్రామాను.. గంటల చర్చల్లో తేల్చేయటమే కాదు.. కలిసి సెల్ఫీ దిగటం.. మిఠాయిలు నోట్లో పెట్టేసుకోవటం లాంటివి జరిగిపోయాయి. ఇంతకాలం కామ్ గా ఉన్న పవన్ కల్యాణ్ పార్టీ నేతలు.. కార్యకర్తలు.. కోడిగుడ్ల దాడి కేసు విషయంలో చర్చలు జరపటంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కత్తి మహేశ్ డిమాండ్లలో ఒకటైన.. పవన్ స్పందన సాకారమైన వేళ.. కత్తి కాస్త మెత్తబడ్డట్లు చెప్పారు.
అయితే.. అసలు కారణం అది కాదని.. పవన్ తెలంగాణ పర్యటన సాగుతున్న వేళ.. అనవసరమైన చికాకులు ఎదురు కాకుండా ఉండేందుకే మహేశ్ నోట్లో మిఠాయిలు పెట్టినట్లుగా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ అభిమానులతో సంధి కుదిరిన వేళ.. మహేశ్ కత్తి మాట్లాడుతూ.. రాజకీయంగా.. సినిమాల పరంగా తన విమర్శలు కొనసాగుతుంటాయని.. వ్యక్తిగత విమర్శలు మాత్రం చేయనని చెప్పటం తెలిసిందే. నోట్లో మిఠాయిలు పెట్టుకున్న ఆనందం తాత్కాలికమేనని.. మహేశ్ మళ్లీ మాటల కత్తి దూయటం ఖాయమని కొందరు చెబుతుంటే.. ముందు మా పవన్ తెలంగాణ పర్యటన పూర్తి కానీ అంటూ ఆయన క్యాంప్ నుంచి వినిపిస్తున్న మాటలు వింటే.. మహేశ్ నోట్లో మిఠాయి లెక్క తేలిపోతుంది.