జగన్ పై ఆరోజే దాడి ఎందుకు.?

Update: 2018-10-30 05:48 GMT
వైసీపీ అధినేత - ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యాయత్నం ప్రీ ప్లాన్ డ్ గానే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిందితుడు శ్రీనివాసరావును కాపాడే ప్రయత్నాలను టీడీపీ శిబిరం చేస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్ జగన్ కు వీరాభిమాని అయితే చంపడానికి ఎందుకు ప్రయత్నిస్తాడని ఆరోపిస్తున్నారు. సానుభూతి డ్రామా అంటూ టీడీపీ చెబుతున్న దొంగ మాటలను కొట్టిపారేస్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నానికి కర్త - కర్మ - క్రియా అంతా విశాఖ ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ కేంద్రంగానే జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  నిందితుడు శ్రీనివాస్ రావు ఆరోజే దాడి చేయడం వెనుక కారణాలేంటనే దానిపైనే దర్యాప్తు బృందాలు ఆరాతీస్తాయి.

నిజానికి వైఎస్ జగన్ విశాఖ ఎయిర్ పోర్టు కు రావడం అదే తొలిసారి కాదు.. మూడు నెలల కాలంలో జగన్ చాలా సార్లు ఎయిర్ పోర్టుకు వెళ్లి హైదరాబాద్ వెళ్లారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర ముగింపు దశ మొదలు.. విశాఖ - విజయనగరంలో యాత్ర జరిగినప్పుడు జగన్ ప్రతీవారం హైదరాబాద్ కు విశాఖ ఎయిర్ పోర్టు నుంచే వెళ్లేవారు. ప్రతి గురువారం విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లి శుక్రవారం తిరిగి వచ్చేవారు. సుమారు మూడు నెలల్లో 20 సార్లకు పైగా జగన్ వెళ్లొచ్చారు. మరి మూడు నెలల కాలంలో జగన్ చాలా సార్లు ఎయిర్ పోర్టుకు వచ్చాడు. వీఐపీ లాంజ్ లో ఎదురుచూశాడు. కానీ ఏ సందర్భంలోనూ వైఎస్ జగన్ వీరాభిమానిగా చెబుతున్న శ్రీనివాసరావు ఫొటో కోసం కానీ.. ఆటోగ్రాఫ్ కోసం కానీ.. కనీసం చూసేందుకు కానీ  వచ్చిన దాఖలాలు లేకపోవడం గమనార్హం.

అయితే అక్టోబర్ 25నే ప్రీ ప్లాన్ డ్ గా సెల్ఫీ పేరిట జగన్ వద్దకు రావడం అనుమానాలకు తావిస్తోంది. జగన్ ఇంటి నుంచే కాఫీ వస్తుంటుంది. అలాంటిది ఫ్యూజన్ ఫుడ్స్ ఎయిర్ పోర్టు నుంచే ఆరోజు సర్వ్ చేయించడం చూస్తుంటే ఇది పక్కా ప్రణాళిక ప్రకారం హత్యాయత్నం కోసం జరిగిందని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

జగన్ విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లేటప్పుడు చెన్ ఇన్ కోసం కొంచెం సేపు  వేచి ఉండడం తప్పనిసరి.. ఈ ఖాళీ సమయాన్ని టార్గెట్ చేసి వీవీఐపీ లాంజ్ లో ఉన్న జగన్ పై కుట్ర చేశారని అనుమానం వ్యక్తమవుతోంది. జగన్ వద్దకు ఎవరొచ్చినా కాదనకుండా సెల్ఫీ ఇచ్చేవారు. అక్కడి ఉద్యోగులు - ప్రయాణికులు - అభిమానులకు జగన్ ఫొటోలు తీసుకునేందుకు అవకాశం కల్పించేవారు. ఈ దృష్ట్యానే జగన్ పై హత్యకు ఈ  సెల్ఫీ పేరిటనే కుట్ర పన్నినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
    

Tags:    

Similar News