పవన్ కు ఆ ఛానెల్ అండ?

Update: 2017-03-19 04:35 GMT
ఈ రోజుల్లో ఒక జిల్లాకు పరిమితమైన నేతలు కూడా తమకంటూ ఏదో ఒక మీడియా సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నారు. ఇందుకోసం లోపాయకారీగా ఒక అండర్ స్టాండింగ్ కు వస్తున్నారు. మీడియా సపోర్ట్ లేకుండా ఏ రాజకీయ పార్టీ.. ఏ పెద్ద నాయకుడూ మనలేడన్నది కాదనలేని సత్యం. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఒక మీడియా అండ తెచ్చుకున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇటీవలి పరిణామాలు చూస్తే ఆ సంగతి స్పష్టమైపోతుంది.

కొన్ని రోజుల కిందటే ఒక టాప్ న్యూస్ ఛానెల్ పవన్ గురించి ఒక అరగంట పాటు ఫుల్ పాజిటివ్ స్టోరీ ఒకటి నడిపింది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ ఒక ఆశాదీపం లాగా కనిపిస్తున్నాడని.. సమస్య అంటే అందరూ అతడి దగ్గరికే వెళ్తున్నారని.. ఆయన ఏదైనా సమస్య మీద ఫోకస్ పెడితే అది పరిష్కారం అయిపోతోందని.. ఇలా సాగింది ఆ కథనం. పవన్ తన వంతుగా ఏదో ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమే కానీ.. అతణ్ని మరీ ఆ రేంజిలో ఆ ఛానెల్ పొగిడేయడం మాత్రం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇందులో ఏదో అజెండా ఉన్నట్లుగా భావించారు విశ్లేషకులు.

ఇప్పుడు పవన్ కొత్త సినిమా ‘కాటమరాయుడు’ ఆడియో వేడుకకు ఆ ఛానెల్ పెద్ద హాజరవడం.. ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకుడినీ బహిరంగంగా పొగడని ఆయన పవన్ ను ఆకాశానికెత్తేయడం.. మీడియా చేయలేని పని పవన్ చేస్తున్నాడని ప్రశంసించడం.. ఇదంతా చూస్తే ఆయన.. ఆయన ఛానెల్ పవన్ విషయంలో ఒక స్టాండ్ తీసుకుని.. ఒక అజెండా ప్రకారం పని చేయడానికి.. మున్ముందు పవన్ కు మరింతగా సహకారం అందించడానికి సన్నద్ధమైనట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి పవన్ ఓ పెద్ద ఛానెల్ అండ సంపాదించడం అతడికి కలిసొచ్చే విషయమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News