సరిగ్గా గమనించారో లేదో... ఎప్పుడూ క్లీన్ షేవ్ తో కనిపించే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మధ్య గడ్డం పెంచి కనిపిస్తున్నారు. సాదారణంగా సినిమా నటులు గడ్డాలు పెంచుకుని తిరుగుతుంటే కొత్త సినిమా గెటప్పేమో అని అభిమానులు తెగ చర్చించేసుకోవడం - దానిపై గాసిప్పులు రావడం తెలిసిన విషయమే. అయితే రాజకీయ నాయకుడు అంతకంటే ముందు ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి - రాష్ట్రపతి భవన్ లో ఆఫీసర్ గా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి కావడంతో ఉత్తమ్ గడ్డంపై కూడా ఆరాలు తీస్తున్నారట జనాలు. దీంతో తాజాగా ఈయన గడ్డం పెంచడం వెనక ఒక రహస్యం దాగి ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఉద్యోగం నుంచి రాజకీయాల్లోకి వచ్చినా.. అప్పటి క్రమశిక్షణే ఇప్పటికీ ఫాలో అవుతూ ఎప్పుడూ నీట్ షేవ్ తో కనిపించే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు పెరిగిన గడ్డంతో జనం ముందుకు రావడం వెనక హెల్త్ రీజన్ వుందని కాంగ్రెస్ నేతలు చెప్పేవారు. కానీ అది అసలు కారణం కాదని, దానివెనుక పెద్ద శపథమే వుందని తెలుస్తోంది. ఇంతకూ ఈ శపథం ఏమిటంటారా... 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేంతవరకు ఉత్తమ్ కుమార్ గడ్డం తీయరట.
దీనికి బలం చేకూరుస్తూ... గడ్డం పెంచుతున్నప్పటి నుంచే ఉత్తమ్ ఆందోళనలు - దీక్షల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో తన పట్టుదల కార్యకర్తలపై తప్పకుండా ప్రభావం చూపుతుందనేది ఆయన ఆలోచనగా ఉందట. నడిపించే నాయకుడు శపథం చేసినప్పుడే నడిచే సైన్యం కూడా కష్టపడి పార్టీ కోసం పని చేస్తాదనేది ఆయన విశ్వాసంగా ఉంది. అయితే, గడ్డం పెంచే విషయంలో తొలుత ఉత్తమ్ సతీమణి అంగీకరించకపోయినా, ఆ తర్వాత ఆమెను ఒప్పించారనేది కాంగ్రెస్ నేతల మాట. కాగా, 2019లో ప్రతిపక్షాలకు పదిలోపే సీట్లు వస్తాయని టీఆర్ ఎస్ తాజా సర్వే చూపించి చెబుతుంటే.. కాంగ్రెస్ గెలిచి వరకు గడ్డం తీయబోనని ఉత్తమ్ శపథం చేయడం ఆసక్తికరంగా మారింది. మరి భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.. ఎందుకంటే మధ్యంతరం వంటివి రాకపోతే ఇంకా రెండున్నరేళ్లు ఉంది మరి!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/