రహస్య సమావేశంలో అర్థం.. సదరు మీటింగ్ సీక్రెట్ గా ఉండాలని. కానీ.. అలాంటివి కూడా బయటకు రావటంపై కాస్త ఆసక్తికరమే. ఈ మధ్యన కాంగ్రెస్ సీనియర్ నేత వివేక్ ను తెలంగాణ అధికారపక్షానికి అత్యంత ముఖ్యులైన కేకే.. మంత్రి హరీశ్ రావులు సమావేశం అయ్యారు. సమావేశం అయ్యింది కూడా కేకే నివాసంలో. రహస్యంగా జరిగిన ఈ సమావేశం వివరాలు బయటకు రావటమే కాదు.. రచ్చ రచ్చగా మారాయి. ఈ సమావేశం అధికారపక్షానికి కించిత్ కూడా నష్టం జరగకుండా.. విపక్ష కాంగ్రెస్ గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా చేశాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రహస్య సమావేశం కాస్తా బహిరంగ సమావేశంగా మారిపోయిన పరిస్థితి.
ఈ భేటీ మీద కాంగ్రెస్ అధినాయకత్వం కూడా స్పందించింది. వివేక్ ను యుద్ధప్రాతిపదికన మంతనాలు జరపటంతో పాటు.. అర్జెంట్ గా ఢిల్లీకి రావాలంటూ కబురు పంపారు. ఇంతకీ రహస్య సమావేశం కాస్తా ఎందుకు బట్టబయలైందన్నది ప్రశ్న. దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న వాదన చర్చనీయాంశంగా మారింది.
వివేక్ తో కేకే..హరీశ్ ల భేటీ వరంగల్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేయమని. అయితే.. తాను పోటీ చేయనని వివేక్ చెప్పటం తెలిసిందే. ఈ మాటే సీక్రెట్ సమావేశం కాస్తా పబ్లిక్ అయ్యేందుకు అవకాశం కల్పించిందని చెబుతున్నారు. వరంగల్ ఉప ఎన్నికల బరిలో వివేక్ ను దింపితే కాంగ్రెస్ కు షాక్ ఇచ్చినట్లు అవుతుందని టీఆర్ ఎస్ భావించింది. అయితే.. వివేక్ కు తన పరిమితులేంటో చాలా స్పష్టంగా తెలుసు. తొందరపడితే తానెంత నష్టపోతానో ఆయనకు తెలియంది కాదు. గతంలోనే కాంగ్రెస్ నుంచి టీఆర్ ఎస్ లోకి చేరి.. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరేలా తీసుకున్న నిర్ణయంపై ఆయన ఇప్పటికి వేదన చెందుతారు. అందుకే.. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలే తప్పించి.. తొందరపడితే పులుసులో ములక్కాయ మాదిరి కావటంతో పాటు.. తన పరపతికి ఇబ్బంది అవుతుందన్న విషయం తెలుసు.
అందుకే.. తెలంగాణ అధికారపక్షం నుంచి వచ్చిన ఆఫర్ ను ఆయన కాదన్నట్లుగా చెబుతున్నారు. ఇక.. రహస్య సమావేశం లీక్ కావటానికి రెండు కారణాలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. టీఆర్ ఎస్ నేతలే ధీన్ని బయట పెట్టారన్నది ఒక వాదన అయితే.. అదేమీ కాదు. కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలే వ్యూహాత్మకంగా ఈ భేటీని బయటపెట్టినట్లుగా చెబుతున్నారు. ఈ రహస్య భేటీ కారణంగా లాభ పడింది టీఆర్ ఎస్ అయితే.. నష్టపోయింది మాత్రం కాంగ్రెస్సే అన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. ఈ వాదనను కాంగ్రెస్ నేతలు అంగీకరించకపోవటం మరో విషయం.
టీఆర్ ఎస్ లోకి వివేక్ కానీ వెళితే.. పార్టీకి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించి.. ముందుస్తుగా ఈ సమావేశాన్ని కాంగ్రెస్ వర్గాలే లీక్ చేసి.. రచ్చ జరిగే సమయంలో అధినాయకత్వం ఎంటర్ అయ్యేలా ప్లాన్ చేశారన్నది ఒక వాదన. మరోవైపు.. తమ మాటనుమన్నించని వివేక్ కు ఇబ్బంది కలిగించేలా చేయాలన్న ఆలోచనతో వివేక్ ఎంట్రీని వ్యతిరేకించే టీఆర్ ఎస్ నేతలే ఈ రహస్య భేటీని పబ్లిక్ చేశారని చెబుతున్నారు. మొత్తంగా రహస్య భేటీ కాస్తా పబ్లిక్ కావటం వెనుక రాజకీయ కోణం ఉందన్నది సుస్పష్టమని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రహస్య భేటీలు అంత మంచివి కాదన్న మాట రాజకీయ పార్టీ నేతల నోటి వెంట వినటం చూస్తే.. వివేక్ ఎపిసోడ్ వారిని ఎంతగా ప్రభావితం చేసిందో చెప్పొచ్చు.