రిషి సునక్ ప్రధాని కాకపోవడానికి జాతివివక్షనే కారణమా?

Update: 2022-09-06 14:30 GMT
బ్రిటన్ ప్రధాని పదవి కోసం జరిగిన రేసులో ప్రవాస భారతీయుడు, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్ ఓటమి పాలయ్యారు. ఈయనను లిజ్ ట్రస్ ఓడించి బ్రిటన్ ప్రధానమంత్రిగా నామినేట్ అయ్యారు. బ్రిటన్  గత ప్రధాని బోరిస్ జాన్సన్ కేబినెట్ లో ఆర్థికమంత్రిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకునప్పటికీ రిషి సునక్ గెలువలేకపోవడానికి జాతివివక్షనే కారణమన్న ప్రచారం సాగుతోంది.

భారతీయ సంతతికి చెందిన రిషి సునక్‌ను ఓడించి లిజ్ ట్రస్  బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. బ్రిటన్ లోని పాలక కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలిగా ఆమెను ఎంపికయ్యారు.  లిజ్ ట్రస్ యునైటెడ్ కింగ్‌డమ్ కొత్త ప్రధానమంత్రి కాబోతున్నారు. ఆమెకు 81,326 ఓట్లు రాగా, రిషి సునక్‌కు 60,339 ఓట్లు వచ్చాయి.

లిజ్ ట్రస్ యూకే 56వ ప్రధానమంత్రి. థెరిసా మే మరియు మార్గరెట్ థాచర్ తర్వాత దేశానికి నాయకత్వం వహించే మూడవ మహిళ కావడం విశేషం. ట్రస్ సౌత్ వెస్ట్ నార్ఫోక్ నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఆమె  గత ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో యూకే విదేశాంగ కార్యదర్శిగా పనిచేశారు.

మన రిషి సునక్ గెలిచి ఉంటే చరిత్ర సృష్టించేవారు. బ్రిటన్ కు ప్రధాని అయిన తొలి నాన్-వైట్ వ్యక్తిగా నిలిచేవారు. భారత సంతతికి చెందిన తొలి వ్యక్తిగా కూడా గుర్తింపు పొందేవాడు.

అమెరికాకు అధ్యక్షుడైన  తొలి నల్లజాతీయునిగా 2008లో బరాక్ ఒబామా చరిత్ర సృష్టించారు. ఒకవేళ రిషి సునక్ గెలిచి ఉంటే బ్రిటన్ లో ఇలాంటి చరిత్రనే లిఖించి ఉండేది. కానీ కాకుండా సొంత పార్టీలోని కీలక సభ్యులే అడ్డుకున్న పరిస్థితి నెలకొంది.

బ్రిటన్ దేశానికి దక్షిణాసియాకు చెందిన వారు ప్రధానులుగా కాలేదు. కేవలం మేయర్లుగా, మంత్రులుగా కొనసాగారు. ప్రీతి పటేల్, సాజిద్ జావిద్, సాధిఖ్ ఖాన్ వంటి వారు ఈ జాబితాలో ఉన్నారు. కానీ ఇంతవరకూ బ్రిటన్ ప్రధాని పదవి కోసం పోటీపడలేదు. బ్రిటన్ లోని మైనార్టీల నుంచి ఇంతవరకూ ఎవరూ ప్రధాని పదవి వైపు చూడలేదు. కానీ రిషి సునక్ 2020లో అత్యంత కీలకమైన బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రి పదవిని చేపట్టడమే కాకుండా ఆ దేశ ప్రధాని రేసులోనూ నిలబడ్డారు.

భారత సంతతికి చెందిన వారు ఇప్పటికే మారిషస్, గయానా, ఐర్లాండ్, పోర్చుగల్, ఫీజీ వంటి దేశాలకు ప్రధానులయ్యారు. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడిగా రిషి సునక్ గెలిచి ఉంటే 42 ఏళ్లకే ఈ ఘనత సాధించేవాడు.

బ్రెగ్జిట్ తర్వాత కరోనా సంక్షోభంలో బ్రిటన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశాన్ని గాడిలో పెట్టిన ఘనత రిషి సునక్ సొంతం. ఆయన పనితీరుకు ప్రశంసలు దక్కాయి.

అయితే రిషి సునక్ భారతీయతను చాటారు. తాను హిందువు అని ప్రకటించడంతో అక్కడ నెగెటివ్ అయ్యారు. బయట ఇతర మతసంప్రదాయాలను, విశ్వాసాలను బహిరంగంగా గౌరవించేవారు. 2015లో బ్రిటన్ పార్లమెంట్ లో భగవద్గీత మీద ఆయన ప్రమాణం చేశారు.

రిషి సునక్ స్వతహాగా బ్రిటీషర్ కాకపోవడం.. ఆయన ఒంటి రంగు నల్లజాతి వాడు కావడమే ఆయన ఓటమికి కారణం అని ఆసియా వాసులు అంటున్నారు. కన్జర్వేటివ్ పార్టీలోని సభ్యుల సామాజిక నేపథ్యం కూడా దీనికి కారణం. కన్జర్వేటివ్ పార్టీలో 97 శాతం మంది తెల్లవారు.. బ్రిటీషర్లు. పైగా 44 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వృద్ధులు.. అందుకే తెల్లజాతి స్వభిమానం పేరిట రిషిసునక్ ఇష్టమైనా.. లిజ్ ట్రస్ కే వారు ఓటు వేసి ప్రధానిని చేశారు.ఇదే విషయాన్ని చాలా మంది ఒప్పుకున్నారు కూడా. శ్వేత జాతీయులు కాని వ్యక్తులను బ్రిటన్ ప్రధాని పదవిలో చూసేందుకు కన్జర్వేటివ్ పార్టీలోని సభ్యులు ఇష్టపడలేదని.. అందుకే మన రిషి సునక్ ను ఓడించారని సర్వేలో తేలింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News