మనసుకు అనిపించింది చెప్పేందుకు ఏ మాత్రం మొహమాటపడని సినీ ప్రముఖులు కొద్ది మందే ఉంటారు. స్టార్ ఇమేజ్ ఎంత ఉన్నా.. నోరు తెరిచి మాట్లాడేందుకు ఇష్టపడరు. దీంతో పలు విషయాలు ఏకపక్షంగా.. ఎవరో నిర్ణయించిన దాని ప్రకారమే సాగుతాయి తప్పించి.. ఆమోదయోగ్యంగా ఉండవన్న మాట వినిపిస్తూ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఉదంతంలోనూ ఇలానే జరిగిందన్న అభిప్రాయం ఎక్కువ అవుతోంది.
ఇప్పటికే ఆర్యన్ డ్రగ్స్ ఇష్యూ మీద చాలామంది సెలబ్రిటీలు మాట్లాడినా.. నటుడు కమ్ రాజకీయ వేత్త కమ్ షాట్ గన్ గా పేరున్న శత్రుఘ్న సిన్హా నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. డ్రగ్స్ కేసులో ఆర్యన్ టార్గెట్ కావటానికి కారణం.. అతని తండ్రి షారుక్ ఖాన్ కు ఉన్న ఇమేజే కారణమని శత్రుఘ్న సిన్హా అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ కేసులో ఆర్యన్ ఖాన్ తో పాటు.. పలువురు సంపన్న కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నారు. వారెవరి గురించి వార్తలు బయటకు రాకున్నా.. ఫోకస్ అంతా ఆర్యన్ ఖాన్ మీదనే ఉందన్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో ఈ ఇష్యూ మీద పోరాడటానికి ఎవరూ ముందుకు రావటం లేదని.. ఇది తమ సమస్య కాదని.. వేరే వారిదని వారు భావిస్తున్నారన్నారు. ఇండియాలో మీడియా మాదిరే వ్యక్తులు సైతం భయపడుతున్నారని.. ఆర్యన్ ను టార్గెట్ చేయటానికి అతని మతమని కొందరు అంటున్నారని.. అందులో నిజం లేదన్నారు.
ఈ కేసులో ఆర్యన్ తో పాటు మూన్ మూన్ ధమేచా.. అర్బాజ్ మర్చింట్ లాంటి ప్రముఖుల పిల్లలు ఉన్నా.. వారిని ఎవరూ పట్టించుకోవటం లేదని.. అందరి ఫోకస్ ఆర్యన్ మీదనే ఉందన్నారు. కారణంగా.. అతడి తండ్రి బాలీవుడ్ బాద్షా కావటమేనని చెప్పారు. గతంలోనూ ఇలాంటి పరిస్థితే చోటుచేసుకుందన్నారు. ఒక కేసులో బాలీవుడ్ నటి దీపికా పదుకునే మీదనే మీడియా ఎక్కువ ఫోకస్ పెట్టిందని చెప్పారు. ఆర్యన్ మీద నిషేధిత డ్రగ్స్ వినియోగం మీద ఆరోపణలు ఉన్నప్పుడు.. బ్లడ్ టెస్టులు.. యూరిన్ టెస్టులు చేశారా? చేస్తే.. వాటి ఫలితాలేమిటి? లాంటి ప్రశ్నల్ని సంధిస్తున్నారు. నిజమే.. షాట్ గన్ వాదనలోనూ పాయింట్ ఉంది కదా? మరి.. దీనికి పోలీసులు ఏమని బదులిస్తారో?