ఇంగ్లండ్ గెలుపు.. కివీస్ ఓటమికి అవే కారణం

Update: 2019-07-15 05:54 GMT
ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే నిలిచిపోయే మ్యాచ్ ఇదీ. మొదట 50 ఓవర్ల ఆటలో టై అయ్యింది.. సూపర్ ఓవర్ లోనూ టై అయిపోయింది. అత్యధిక బౌండరీల ఆధారంగా ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ఈ నిబంధన ఎలా ఉన్న ఓడిన కివీస్ ను దురదృష్టం కూడా వెంటాడింది. అసలు ఆ రెండు తప్పులు చేయకపోయి ఉంటే న్యూజిలాండ్ గెలిచేదని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.  

ఇంగ్లండ్ ను గెలిపించిన బెన్ స్టోక్స్ మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ విలయమ్ సన్ కు క్షమాపణ చెప్పారు. న్యూజిలాండ్ ఆటగాడు విసిరిన బంతి తన బ్యాట్ ను తాకి బౌండరీకి వెళ్లి అదనంగా 4 పరుగులు రావడంపై అతడు ఇలా సారీ చెప్పాడు..

ఇంగ్లండ్ ఓటమికి, కివీస్ పరాజయానికి ఆ రెండే ప్రధాన కారణమని స్పోర్ట్స్ విశ్లేషకులు చెబుతున్నారు. కివీస్ కు దురదృష్టం వెంటాడి.. ఇంగ్లండ్ అదృష్టంగా గెలిచిందంటున్నారు..

ఇంగ్లండ్ చివరి ఓవర్లో మూడు బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన సమయం అదీ. బౌలర్ బౌల్ట్ సూపర్ గా వేస్తున్నాడు. న్యూజిలాండ్ కే ఎక్కువ అవకాశాలున్నాయి. అయితే స్టోక్స్ కొట్టిన బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఆ బంతి న్యూజిలాండ్ ఫీల్డర్ గప్తిల్ కు దొరకగా త్రో విసిరాడు. అది స్టోక్స్ బ్యాటును తాకి బౌండరీకి వెళ్లింది. దీంతో ఓవర్ త్రో రూపంలో  రెండు పరుగులతోపాటు అదనంగా 4 పరుగులు మొత్తం 6 పరుగులు వచ్చి మ్యాచ్ డ్రా అయ్యింది. ఆ బంతి స్టోక్స్ బ్యాట్ కు తగలకపోయి ఉంటే ఫలితం వేరేలా ఉండేది.

ఇక బెన్ స్టోర్ 48వ ఓవర్ లో సిక్స్ కొట్టగా బౌండరీలైన్ వద్ల బౌల్ట్ పట్టేశాడు. దాన్ని గాల్లో విసిరి పక్కనే ఉన్న ఫీల్డర్ కు అందించాడు. అయితే బ్యాలెన్స్ ఆగక బౌండరీలైన్ ను తాకాడు. బంతి సిక్స్ గా మారింది.. కొంచె ముందు బంతిని పక్కనే ఉన్న ఫీల్డర్ కు అందించి ఉంటే స్టోక్స్ ఔట్ అయ్యి న్యూజిలాండ్ గెలిచి ఉండేది.

ఇలా న్యూజిలాండ్ కు ఈ రెండు సంఘటనలు దురదృష్టంగా మారగా.. ఇంగ్లండ్ కు మాత్రం అనుకోని వరమై మ్యాచ్ ను సొంతం చేసింది. ప్రపంచకప్ విజేతగా నిలిపింది. ఇక ఇందులో స్టోక్స్ అసమాన పోరాటం మాత్రం కాదనలేనిది.  

    
    
    

Tags:    

Similar News