ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫలితాలపై ప్రతిపక్షాల విమర్శలు సరికాదని అంటున్నారు.. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి. తమ ప్రభుత్వం ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా.. అత్యంత పారదర్శకంగా.. పరీక్షలను కఠినంగా నిర్వహించిందని అందుకే ఎక్కువ మంది పాస్ కాలేదని ఆయన చెబుతున్నారు. అలాగే ఈ ఏడాది బిట్ పేపర్ లేకపోవడం విద్యార్థులను దెబ్బతీసిందని.. ఇది కూడా ఉత్తీర్ణత శాతం తగ్గడానికి కారణమని అంటున్నారు. మరోవైపు పదో తరగతి ఫలితాలపై కోవిడ్ కూడా ప్రభావం చూపించిందని సజ్జల వివరించారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రభుత్వాన్ని కంట్రోల్ చేశాయని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వ హయాంలో చైతన్య, నారాయణ మాల్ ప్రాక్టీస్ కు పాల్పడేవని.. అందుకే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉత్తీర్ణత శాతం ఏటా 90 శాతానికి పైగా ఉండేదని సజ్జల అసలు విషయం చెబుతున్నారు.
కోవిడ్‌తో రెండేళ్లుగా పరీక్షలు లేకపోవడంతో విద్యార్థుల్లో పరీక్షల స్ఫూర్తి తగ్గి ఉండొచ్చని సజ్జల రామకృష్ణారెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల కూడా ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండవచ్చని అంటున్నారు. అయితే ఇంగ్లిష్ మీడియం వల్ల ఉపయోగాలు భవిష్యత్తులో తప్పకుండా తెలుస్తాయని సజ్జల స్పష్టం చేయడం గమనార్హం. కాగా పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా ఇన్‌స్టెంట్, బెటర్‌మెంట్ పరీక్షలు పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వివరించారు.
టీడీపీ అనవరసమైన విమర్శలు చేస్తోందని.. ఆ పార్టీ ఉద్దేశం అసలు పరీక్షలు ఉండాలనా లేక అందరినీ పాస్ చేసి పంపాలనా అని సజ్జల ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరిపిందని వివరించారు. ఇంతకాలం 90 శాతం పైగా ఉత్తీర్ణత వస్తే ఇంత ఉత్తీర్ణత ఎలా సాధ్యమైందని విమర్శలు చేసేవారని ఇప్పుడు ఉత్తీర్ణత తగ్గితే విమర్శలు చేస్తున్నారని సజ్జల ధ్వజమెత్తారు.
మరోవైపు పదో తరగతి పరీక్షల్లో 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ కావడంపై ప్రతిపక్షాలు జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఉపాధ్యాయులను పాఠాలు చెప్పనీయకుండా బోధనేతర కార్యక్రమాలకు వాడుకున్నారని.. దీంతో బోధన కుంటుపడిందని ఆరోపిస్తున్నారు. విద్యా రంగంలో అస్తవ్యస్త విధానాలతో పాఠశాల విద్యను భ్రష్టు పట్టించారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పదో తరగతి ఫలితాలకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో సజ్జల ప్రతిపక్ష నేతల విమర్శలపై ఘాటుగా స్పందించారు.
కాగా జూన్ 6న వెలువడిన ఆంధ్రప్రదేశ్ పదోతరగతి ఫలితాల్లో ఎక్కువ మంది విద్యార్థులు మ్యాథ్స్, సైన్సు, సోషల్ సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. ఉత్తీర్ణత గత 20 ఏళ్లలో లేనంత దారుణంగా పడిపోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 6,15,908 మంది పరీక్షలు రాస్తే 2,01,627 మంది ఫెయిల్ అయ్యారు. ఉమ్మడి ఏపీలో 2002లో 66.06 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా ఈసారే ఇంత తక్కువగా 67.26 శాతం నమోదవడం గమనార్హం.