ఆయన వెండితెర మీద ఎర్రెర్రని కళ్ళతో నటనాభినివేశం చూపించి రెబెల్ స్టార్ గా ఏళ్ళకు ఏళ్ళు జనం గుండెల్లో కొలువున్న నేత. ఇక ఆయన రాజకీయాల్లో కూడా చాన్నాళ్ళు ఉన్నారు. కీలకమైన పాత్రనే అక్కడా పోషించారు. కేంద్ర మంత్రిగా చాలా కాలం పనిచేశారు. కాంగ్రెస్ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసి బీజేపీలో పదవులు అందుకుని ప్రజారాజ్యంతో మరోసారి పోటీ చేసి ఓడిన క్రిష్ణం రాజు దశాబ్ద కాలం పైగా రాజకీయాల్లో పెద్దగా చురుకుగా ఉండడం లేదు.
అయితే ఆయన మరణించే నాటికి బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆయన మా వారు అని ఆ పార్టీ కండువా కప్పేసి మరీ సొంతం చేసుకునే ప్రయత్నం చేసింది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శకు వెళ్ళి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని కలసి వచ్చారు. వైసీపీ చూస్తే తన మంత్రులను హైదరాబాద్ పంపించి అంతిమ యాత్రలో పాల్గొనేలా చూసింది.
ఇక క్రిష్ణం రాజు సొంత ఊరు మొగల్తూరులో జరిగిన సంస్మరణ కార్యక్రమానికి కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ మంత్రులు అటెండ్ అయ్యారు. ఈ సందరభంగా మొగల్తూరులో క్రిష్ణం రాజు స్మృతి వనం నిర్మిస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటిదాకా రెబెల్ స్టార్ విషయంలో పరామర్శల పర్వం సాగినా ఈ ప్రకటన తరువాతనే రాజకీయ పరమైన విమర్శలు వచ్చాయి.
ఇదంతా వచ్చే ఎన్నికల్లో గోదావరిలో బలమైన క్షత్రియ సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగమని టీడీపీ అనుకూల మీడియా రాతలు రాయడం మొదలెట్టింది. ఇంకోవైపు రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు అయితే వైసీపీ ఈ రకమైన ఎత్తులు వేసినా ఎవరూ నమ్మరని అంటున్నారు.
ఈ నేపధ్యం నుంచి చూసినపుడు సెంటిమెంట్ రాజకీయాలకు ఎవరు తెర తీశారు, అది ఎక్కడ దాకా సాగుతూ వస్తోంది అన్నది ఒక్కసారి కనుక చూస్తే బీజీపీనే ముందు చెప్పుకోవాలి. రెబెల్ స్టార్ గా ఉన్న క్రిష్ణం రాజు మరణిస్తే ఆయన ఒంటి మీద బీజేపీ జెండాను కప్పి ఆ పార్టీ వారు తమ వారే రాజుగారు అని చెప్పుకునే ప్రయత్నం చేశారు.
ఇక కేంద్ర మంత్రి రాజ్ నాధ్ సింగ్ స్వయంగా క్రిష్ణం రాజు ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ ని పలకరించారు. ఈ సందర్భంగా క్రిష్ణం రాజు రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు అని కూడా తెలుస్తోంది. క్రిష్ణం రాజు తమ్ముడు పెద్ద కుమారుడు ప్రబోధ్ ని వచ్చే ఎన్నికల్లో నర్సాపురం లోక్ సభ సీటు నుంచి పోటీ చేయిస్తారు అని ప్రచారం సాగుతోంది.
మరి దానికి ఆయన ఎంతవరకూ ఓకే చెబుతారు అన్నది చూడాలి. ఇక ప్రభాస్ మొగల్తూరు లో ఉన్నపుడు వైసీపీకి చెందిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆయన ఇంటికి వెళ్ళి మరీ చర్చలు జరిపారు అని ప్రచారం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ప్రభాస్ ఫ్యామిలీ మెంబర్స్ వైసీపీ తరఫున పోటీ చేస్తే తాను భీమవరం సీటు వదులుకుంటాను అని ఆయన చెప్పినట్లుగా ప్రచారం అయితే సాగింది. ఇందులో నిజమెంతో తెలియదు.
ఇక క్రిష్ణం రాజు ది విజయనగరం రాజుల వంశం. వారికి గోదావరి జిల్లాల్లో పట్టుంది. గెలుపోటములతో సంబంధం లేకుండా క్రిష్ణం రాజు ఎపుడు పోటీ చేసినా రెండు మూడు లక్షలకు తక్కువ కాకుండా ఓట్లు తెచ్చుకున్న సందర్భం ఉంది. ఇదిలా ఉంటే క్రిష్ణం రాజు విషయంలో బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వాన పెద్దగా పట్టించుకోలేదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి.
ఆయన మోడీకి గట్టి మద్దతుదారుగా ఉన్నారు. ఆయన గవర్నర్ పోస్ట్ కోరుకున్నారు. కానీ అది ఆయనకు దక్కలేదు అన్న బాధ అసంతృప్తి అయితే ఆయనలో ఉంది అని చెబుతారు. ఇదిలా ఉంటే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ కావడంతో ఆయన ఇమేజ్ తో రాజకీయ లాభం పొందడానికే ప్రబోధ్ ని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని బీజేపీ వత్తిడి తెస్తోంది అని అంటున్నారు.
మరి అవకాశం ఉంటే టీడీపీ కూడా టికెట్ ఇవ్వడానికి రెడీ. ఇపుడు వైసీపీ కూడా వచ్చి చేరింది. ఇలా మూడు పార్టీలూ రెబెల్ స్టార్ కుటుంబానికి రాజకీయ గేలం వేస్తున్నా ఆ ఫ్యామిలీ అయితే పాలిటిక్స్ కి దూరం అనే అంటున్నారు. ప్రభాస్ అయితే రాజకీయాల పట్ల ఏ మాత్రం ఆసక్తిగా లేరనే చెబుతున్నారు. ఈ నేపధ్యంలో రెబెల్ స్టార్ చుట్టూ సెంటిమెంట్ రాజకీయం ఎంతవరకూ పండుతుంది అన్నది చూడాలి. అయితే రెబెల్ స్టార్ కి స్మృతి వనం అన్నది నిర్మించాలనుకోవడం మంచి ఆలోచనే అని అంటున్నారు. మరి దీని వల్ల క్షత్రియులు వైసీపీకి దగ్గర అవుతారా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే.
ఎందుకంటే ఆ పార్టీ గత మూడేళ్ళ కాలంలో తన తప్పుడు నిర్ణయాల ఫలితంగా క్షత్రియ సామాజికవర్గాన్ని దూరం చేసుకుంది. ఈ క్రమంలో వాటిని సరిదిద్దుకోవడానికి అన్నట్లుగా ఈ రకామైన చర్యలు అంటున్నారు. కానీ ఇప్పటికే గోదావరి క్షత్రియుల మనసు మారింది అని అంటున్నారు. అయితే రాజకీయాలు కాబట్టి ఎవరూ ఆశలు వదులుకోరు. సో రెబెల్ స్టార్ చుట్టూ సాగుతున్న రాజకీయం మాత్రం గోదావరిలో ఏ తీరానికి చేరుతుందో వెయిట్ చేసి చూడాల్సిందే..
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.