రఘురామకృష్ణం రాజు.. ఈ వైసీపీ రెబల్ ఎంపీ ఏం చూసుకొని వైసీపీతో ఫైట్ పెట్టుకుంటున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదట.. ఈయన ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు కాదన్నది అందరికీ తెలిసిందే.. వైఎస్ జగన్ టికెట్ ఇస్తే ఆ గాలిలో గెలిచేశాడంటారు. కానీ ఇప్పుడా వాపును చూసుకొని రెచ్చిపోతున్నారా అంటే ఔననే అంటున్నారు నర్సాపూర్ జనాలు.. గెలిపించిన వారికే రఘురామ అంటే ఎవరో తెలియదని.. ఆయన అంతకుముందు ఎవరికి సాయం చేయడం కానీ.. ప్రజాసేవ చేసిన దాఖలాలు కానీ లేవంటున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఎగిరెగిరి పడుతున్నాడో తెలియడం లేదంటున్నారు.
ఇటీవల నర్సాపూర్ పార్లమెంట్ పరిధిలో ఒక ఫోన్ సర్వే చేస్తే వైసీపీకి దాదాపు 58శాతం మంది మద్దతు తెలిపితే.. టీడీపీకి 37శాతం మంది, బీజేపీ+జనసేనకు 4.5శాతం.. రఘురామకృష్ణం రాజుకి 0.5శాతం ఓట్లు వచ్చాయి. ఫోన్ ద్వారా 7 నియోజకవర్గాల్లో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంకు 75 శాంపిల్స్ తీశారు.
ఈ సర్వేలో రఘురామకృష్ణం రాజుకి అంత సీను లేదని తెలిసింది. లోకల్ గా ఉండే ఎమ్మెల్యేలకు కొంత ఆదరణ ఉందని తేలింది. మొత్తం ఏపీ సీఎం జగన్ ను చూసి ఓట్లు వేశామని.. కానీ ఎంపీ రఘురామకృష్ణం రాజును చూసి ఓట్లు వేయం అని అక్కడ వివిధ సంఘాల ద్వారా తెలిసింది.
టీడీపీ అనుకూల మీడియా ఎంత ఉదరగొట్టినా స్థానికంగా రఘురామకృష్ణం రాజు అంటే స్థానికంగా ఎవరికీ పెద్దగా తెలియదు అని.. ఆయన ఎవరికి సహాయం కూడా చేయలేదు అని అంటున్నారు. ఇలా రఘురామకృష్ణం రాజు మీద పెద్దగా అక్కడ ఉన్న ఓటర్లకి ఆసక్తి లేదు అని చెప్తున్నారు.
మరి వైసీపీ అధిష్టానంతో ఈ పోరాటంలో రఘురామకృష్ణం రాజు రాజీనామా చేస్తాడో లేదో తెలియదు.. ఒకవేళ వైసీపీ అధిష్టానం ఆయనను అనర్హుడిగా ప్రకటింపచేస్తే మాత్రం రఘురామ మళ్లీ గెలవడం కల అని స్థానిక ఓటర్ల బట్టి తెలుస్తోంది.