వద్దు.. వద్దు.. అంటున్నా.. వైసీపీ నాయకులు జనసేనాని పవన్‌ను కెలకడం మాత్రం మానడం లేదు. ఆయనను వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయడం అసలు మానలేదు. పవన్ వైసీపీ నాయకులకు గట్టిగా ఇంకా గట్టిగా .. వార్నింగ్ ఇచ్చి కనీసం 24 గంటలు కూడా కాలేదు. చెప్పుతో కొడతా.. ! అని వ్యాఖ్యానించిన మాటలు.. ప్రజల చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. అయినా.. తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు మాత్రం ఎక్కడా తగ్గలేదు. వాస్తవానికి ఈయన డాక్టర్. 'డాక్టర్ మంత్రి' అని ఆయనకు మంచిపేరు కూడా ఉంది. కానీ, తాజా వ్యాఖ్యల్లో ఆయన దారి తప్పేశారు.
పవన్‌ను ఆయన కుటుంబాన్ని మరోసారి ఏకేశారు. మూడు పెళ్లిళ్ల ఉదంతాన్ని తెరమీదికి తీసుకువచ్చి.. "అమ్మాయిని చేసుకోవడం.. వాడుకోవడం. తర్వాత.. ప్యాకేజీ ఇచ్చి పంపించేయడం. మళ్లీ మరొకరిని పెళ్లిచేసుకునివాడుకుని.. ప్యాకేజీ ఇచ్చి పంపేయడం.
ఇలా.. ఇప్పటికి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. దీనికి డబ్బంతా.. చంద్రబాబే ఇస్తున్నాడు. ఆయన దగ్గర ప్యాకేజీ తీసుకోవడం. కొంచెం కొంచెం ఇతరులకు పంచడం.. తన పనితాను చేసుకోవడం. ఇదేనా.. ప్యాకేజీ పవన్ కళ్యాణ్ పని!'' అని వ్యాఖ్యానించారు.
వాస్తవానికి.. సీఎం జగన్ అయినా.. ఎప్పుడు.. కూడా.. ఇలా విమర్శించమని చెప్పే పరిస్థితి లేదు. కానీ, మంత్రులు.. మాత్రం కొంత దారి తప్పుతున్నారనే చెప్పాలి. దీనివల్ల వారి ఇమేజ్ పెరుగుతుందని.. అనుకుంటే..పొరపాటే. వాస్తవానికి.. వారికి ఇబ్బందితోపాటు.. పార్టీ కూడా.. భారీగా నష్టపోతుంది. రాజకీయాల్లో వ్యూహాలపై దూకుడు చూపించాలే తప్ప.. మాటల్లో దూకుడు కాదు. మాటలు చేటు తెస్తాయే కానీ.. మంత్రులకైనా.. నాయకులకైనా.. ఒక్క ఓటు కూడా తీసుకురాదు.
నాయకుడు అయితే పార్టీ తరఫున బలంగా పనిచేయడం.. మంత్రి అయితే.. ప్రభుత్వం తెచ్చిన పథకాలను అమలు చేయడం.. చేస్తే.. ఎవరు ఎదురొచ్చినా.. ప్రజల ఆశీర్వాదం దక్కుతుంది.
అంతేతప్ప.. నోరు పారేసుకుంటే.. వ్యక్తిగత హననానికి.. పూనుకొంటే.. వచ్చేది.. మెప్పు కాదు..ముప్పే. అదివారిని.. వారు నీడ పొందుతున్న పార్టీని కూడా.. ముంచేయడం ఖాయం. మరి ఈ వాస్తవాన్ని ఇప్పటికైనా.. తెలుసుకుంటే.. మంచిదని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.