ఏపీలోని వైసీపీ ప్రభుత్వం తాము బీసీలకు న్యాయం చేస్తున్నామని, అన్నింటా వారికి ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతోంది. అంతేకాదు, అసలు బీసీలకు టీడీపీ ఏం చేసిందనే ప్రశ్నను కూడా తెరమీదికి తెస్తోంది.
కానీ, బీసీల అభ్యున్నతి కోసం వారికి ఏం చేయాలో సూచించేందుకు వేసిన ఏకసభ్య కమిటీలో కూడా రెడ్లనే నియమించడం గమనార్హం. ఇదిలావుంటే, అసలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బీసీ జపం నిజమేనా? దీనిలో వాస్తవం ఎంత ఉంది? అనే విషయాలను తాజాగా టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు గణాంకాల సయితంగా వివరించారు.
ఇది పూర్తిగా ప్రభుత్వం నుంచి సేకరించిన లెక్కలేనని, తాను కానీ, తన పార్టీ టీడీపీ కానీ చెబుతున్న విషయాలు కావని అయ్యన్న వివరించారు. మరి ఈ లెక్కలు చూస్తే, బీసీల గురించి వైసీపీ ఏం మాట్లాడుతుందనే ధర్మ సందేహం అందరిలోనూ కలుగుతోంది. మరి ఆ లెక్కలేంటో మనమూ చూద్దాం..
+ రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు మొత్తం 981.
వీటిలో రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చినవి 742 అంటే 76 శాతం
బీసీలకు ఇచ్చినవి 6 అంటే 1 శాతం
+ తిరుమల తిరుపతి దేవస్తానంలో ఉన్న నామినేటెడ్ పోస్టులు 36
వీటిలో రెడ్లకు ఇచ్చినవి 11
బీసీలకు ఇచ్చినవి 3
+ విశ్వవిద్యాలయాల్లో వైస్ చాన్సెలర్ పోస్టులు 12
వీటిలో రెడ్లకు కేటాయించినవి 10
బీసీలకు ఇచ్చింది 1
+ కీలకమైన ప్రభుత్వ సలహాదారుల పోస్టులు మొత్తం 42
వీటిలో రెడ్డి వర్గానికి ఇచ్చినవి 35
బీసీలకు ఇచ్చినవి 1
+ విప్ పోస్టులు మొత్తం 8
వీటిలో రెడ్లకు కేటాయించినవి 4
బీసీలకు ఇచ్చినవి 1
కొసమెరుపు: వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎక్కడ మాట్లాడినా తమ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తోందని చెబుతున్నారు.చంద్రబాబు కేవలం వాడుకుని వదిలేశారని ఆరోపిస్తున్నారు. మరి జగన్ ప్రభుత్వంలో ఏం జరుగుతోందో తెలిశాక కూడా ఇప్పుడు ఏం చెబుతారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.