ఆ సీఎం నుంచి రూ.97 వసూలు చేయమన్నారు

Update: 2017-03-30 04:33 GMT
నోరు తెరిస్తే చాలు.. పేదరికపు మాటలతో మైండ్ బ్లాక్ అయ్యేలా మాటలు చెబుతుంటారు అమ్ ఆద్మీ అధినేత.. ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పార్టీ దగ్గర పైసలు లేవన్న విషయాన్ని తరచూ చెప్పే ఆయన.. నిధుల సమీకరణకోసం చాలానే కష్టపడుతుంటారు.  తరచూ నిధుల సమస్యను ఎదుర్కొనే ఆయనకు డబ్బుల విలువ బాగానే తెలుసన్న విషయంలో మరో సందేహం ఉండదు.

కానీ.. అలాంటి వ్యక్తి సైతం డబ్బు ఖర్చు విషయంలో తప్పులు చేసి విమర్శలు ఎదుర్కోవటమే కాదు.. ఇప్పుడు దిమ్మ తిరిగిపోయేలాంటి ఆదేశంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలపై రూ.97 కోట్లు ఖర్చు చేసిందని.. ఆ మొత్తాన్నిఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 30 రోజుల్లో వసూలు చేయాలంటూ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శికి  ఢిల్లీ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సంచలన ఆదేశాలు జారీ చేశారు.

అంతే కాదు.. ప్రకటనల కోసం నిబంధనలకువిరుద్ధంగా చేసిన ఖర్చుపై ఢిల్లీ సీఎం పైనా.. ఆమ్ ఆద్మీ పార్టీ పైనా విచారణ చేయాలన్నారు. ప్రకటనలపై ప్రభుత్వం వృథాగా ఖర్చు చేస్తుందని కేంద్రం రిక్రూట్ చేసిన ముగ్గురు సభ్యులతో కూడిన టీం ఇచ్చిన నివేదిక నేపథ్యంలో.. ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ప్రకటల ఖర్చు పద్దు కింద రూ.97 కోట్లు అయినప్పటికీ.. ప్రకటనల ఏజెన్సీలకు మాత్రం ఇప్పటివరకూ రూ.42కోట్లను మాత్రమే ప్రభుత్వం చెల్లించినట్లుగాతెలుస్తోంది. మరి.. మిగిలిన రూ.55 కోట్లు చెల్లిస్తారా?నిలిపివేస్తారా?అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News