గతంలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా క్యాలెండర్ వైపు అదే పనిగా చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు చోటు చేసుకుంది. వారం.. పది రోజుల క్రితం వాడి రోజులకు వీకెండ్ కు మధ్య వ్యత్యాసం ఉండేది. ఇప్పుడు అలాంటిదేమీ లేదు. అన్ని రోజులు ఒకేలా ఉంటున్నాయి. రోజువారీ రోటీన్ జీవితమే అయినా.. అంతో ఇంతో కొత్తదనం ప్రతి జీవితంలో ఉండేది. ఇప్పుడు మాత్రం అలా లేదు. కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్.. ఇంటికే పరిమితం కావటంతో మొబైల్ ఫోన్లు ఎప్పటికప్పుడు వచ్చే కొత్త టిక్ టాక్ వీడియోలు.. ఫేక్ వీడియోలు తప్పించి జీవితంలో కొత్తదనం అంటూ ఉండని పరిస్థితి.
ఇలాంటివేళలోనూ.. కొందరు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ రోజు మార్చి 29. దీనికేమైనా ప్రత్యేకత ఉందా? అంటే కాస్త ఉందని చెప్పాలి. ఎందుకంటే.. మార్చి 13న తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ కేసు పేషెంట్ ను గాంధీ నుంచి డిశ్చార్జ్ చేసిన రోజు. దీనికి పద్నాలు రోజులు కలిపితే మార్చి 27. ఎందుకైనా మంచిది మరో రెండు రోజులు అదనంగా వేసి చూసినా.. పాజిటివ్ గా లెక్క తేలి గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న వారు.. ఇప్పటికి బయటకు రాని పరిస్థితి. ఎందుకిలా? అన్న ప్రశ్న కొందరిని వేధిస్తోంది.
అయితే.. ఇలాంటి లెక్కల్లో మునిగితేలే వారు మరిచిపోతున్న విషయాన్ని కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నమోదైనట్లుగా రోజుకు ఐదారు.. పది.. పదిహేను కేసులు మొదట్లో అంతగా లేవు. ఒక పాజిటివ్ కేసుకు.. మరో పాజిటివ్ కేసుకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది. దీనికి తోడు.. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. వైరస్ తీవ్రతను గుర్తించిన వైద్యులు..తొందరపడి డిశ్చార్జ్ చేయటానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదంటున్నారు.
ఇప్పుడున్న వసతులకు.. వస్తున్న కేసులు చాలా తక్కువగానే ఉండటంతో.. ఉన్న పేషంట్ల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పాజిటివ్ కేసులు కాస్తా నెగిటివ్ కేసులుగా తేలి.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిసినా.. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. వైరస్ తీవ్రత కాస్త తగ్గిన తర్వాత వారిని డిశ్చార్జ్ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు.. ఇప్పుడు నడుస్తున్న నెగిటివిటీ వేళ.. ఒకరిద్దరు డిశ్చార్జ్ కంటే కూడా.. ఒకేసారి పది.. పన్నెండు మందిని డిశ్చార్జ్ చేయటం ద్వారా ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచటం.. భయాందోళనలు తగ్గించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఏప్రిల్ మొదటి వారాంతానికి కొద్దిమందిని డిశ్చార్జ్ చేసే వీలున్నట్లుగా చెబుతున్నారు.