1, 2, 3... 10, 100 ... 10 వేలు, 50 వేలు... ఇది కరోనా కేసుల నమోదు తీరు. ఒక్క కేసు బయటకు వస్తే లాక్ డౌన్ కు వెళ్లిపోయిన మనదేశం రోజుకు 50 వేలు వస్తున్నా కరోనాతో కలిసి జీవించాల్సి వస్తోంది. ఇన్ఫెక్షన్ ఈ స్థాయిలో ఉన్నా కూడా జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు పోవాల్సిందే తప్ప రోజువారీ జీవితాన్ని ఆపుకుని బతకలేని పరిస్థితి.
అయితే, ఇలాంటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో చిన్న చిన్న ఊరటలు మనకు స్వల్ప సంతృప్తిని కలిగిస్తున్నాయి. మరణాల రేటు తగ్గడం, వ్యాధి తీవ్రత తగ్గడం కొంచెం పెరిగింది. తాజాగా రికవరీ రేటు బాగా పెరుగుతోంది.
అన్ లాక్ 3 మొదలయ్యేనాటికి రోజువారీ కేసుల సంఖ్య 50 వేలకు చేరింది. అయితే అదే సమయంలో రికవరీల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 17 లక్షలు దాటి పోగా గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసుల రికవరీ నమోదైంది. ఒక్కరోజులో దాదాపు 51,255 మంది కోలుకున్నారు.
కేసుల సంఖ్య స్థాయిలో రికవరీలు చోటు చేసుకోవడం ఒక శుభ పరిణామంగానే పేర్కొనవచ్చు. ముఖ్యంగా... మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్యతో సమానంగా గాని, అధికంగా గానీ రికవరీలున్నాయి. కేసులు డిశ్చార్జిలు ఎంత ఎక్కువ ఉంటే కొత్త రోగులకు చికిత్స అవకాశాలు అంత ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ఆరోగ్య వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది. ఇతర దేశాలతో పోలిస్తే మన సంప్రదాయ విధానాల వల్ల గాని, డి విటమిన్ లోపం తక్కువగా ఉండటం వల్ల రికవరీల వేగం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.