కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఉధృతంగా విస్తరిస్తుందో అంతేస్థాయిలో రికవరీలు కూడా ఉండడం ఊరటనిస్తోంది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
ఇదే క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మహమ్మారి బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండడం ఊరటనిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణను చూస్తే 49259కి పాజిటివ్ కేసులు చేరుకున్నాయి. ఇందులో 37666 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అంటే తెలంగాణలో రికవరీ 76శాతంగా ఉండడం విశేషం. ఇందులో 15000 మంది అంటే 30శాతం మంది హోం క్వారంటైన్ లోనే ఉండి చికిత్స పొందారు.
ఇక ఏపీలో ఇప్పటివరకు 64713 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 32127మంది (50శాతం) మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
తెలంగాణ 76శాతం, ఏపీలో 50శాతం రికవరీ రేటు ఉండడం కొంతలో కొంత శుభ పరిణామం అని వైద్యనిపుణులు చెబుతున్నారు. కరోనాను ఎదుర్కొనే శక్తి ప్రజలకు పెరుగుతోందని తెలుస్తోంది.