గుడ్ న్యూస్ : దేశంలో రికవరీ రేటు భారీగా పెరిగిందట..!

Update: 2020-05-21 06:45 GMT
మన దేశంలో రికవరీ రేటుపై కేంద్ర వైద్యఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌ లో కరోనా ప్రభావానికి సంబంధించి బుధవారం ప్రెస్‌ మీట్ నిర్వహించిన ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. దేశంలో  ‌లో ఇప్పటివరకూ 42,298 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారని.. ఇది కొంత సంతృప్తికర విషయమని ఆయన చెప్పారు. ప్రస్తుతం భారత్‌ లో 61,149 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆయన తెలిపారు.

ప్రపంచ మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుంటే లక్ష మందిలో 62 మంది ఈ మహమ్మారి బారిన పడ్డారని ఆయన చెప్పారు. అదే భారత్‌ లో.. లక్షకు 8 మందికి మాత్రమే కరోనా సోకినట్లు తేలిందని లవ్ అగర్వాల్ వెల్లడించారు. భారత్‌ లో లాక్‌ డౌన్ అమలైన కొత్తలో రికవరీ రేటు 7 శాతంగా ఉందని.. అదే ఇప్పుడు 39.6 శాతానికి పెరిగిందని చెప్పారు. లాక్‌ డౌన్ 1 నాటికి 7.1 శాతం - లాక్ ‌డౌన్ 2.0 నాటికి 11.42 శాతం - లాక్‌ డౌన్ 3.0 నాటికి 26.59 శాతంగా ఉన్న రికవరీ రేటు లాక్ ‌డౌన్ 4.0 నాటికి 39.62 శాతానికి పెరిగిందని లవ్ అగర్వాల్ ప్రకటించారు.
Tags:    

Similar News