ఏపీ లో క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల్లో సడ‌లింపులు : సీఎం జ‌గ‌న్ సంచలన నిర్ణయం

Update: 2021-07-12 07:54 GMT
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మహమ్మారి కట్టడి కోసం విధించిన కర్ఫ్యూ ఇంకా ఆంక్షలతో కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ , మూడో వేవ్ ముప్పు , నిపుణుల అభిప్రాయాల మేరకు ఇంకా రాష్ట్రంలో ఆంక్షలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఉదయం సమయంలో లాక్ డౌన్ నుండి సడలింపు ఇచ్చి రాత్రి సమయంలో కర్ఫ్యూ ను ఖచ్చితంగా పక్కాగా అమలు చేస్తున్నారు. అలాగే మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా కొనసాగిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఉండటంతో వేగంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది కొనసాగుతుంది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి పరిస్థితి పై తాజాగా సీఎం జగన్ పలువురు మంత్రులతో కలిసి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆళ్ల‌నాని, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌తో పాటు ప‌లువురు అధికారుల‌తో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హిస్తున్నారు.  ఏపీలో  క‌రోనా క‌ట్ట‌డికి తీసుకుంటోన్న చ‌ర్య‌ల‌పై ఆయ‌న చ‌ర్చిస్తున్నారు. రాష్ట్రంలో కొన‌సాగుతోన్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై ఆయ‌న వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఏపీలో క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల‌ను మ‌రింత స‌డ‌లించే అంశంపై నిర్ణ‌యం తీసుకున్నారు.  రాష్ట్రంలో అన్ని జిల్లాల‌కు ఒకే విధంగా క‌ర్ఫ్యూ నిబంధ‌న‌ల అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు. ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌క్ఎ క‌ర్ఫ్యూ ఉండ‌బోదు. రాత్రి 9 గంట‌లకు అన్ని దుకాణాలు మూసి వేయాల్సి ఉంటుంది. అలాగే రాష్ట్రంలో పేస్ మాస్క్ పెట్టుకోకపోతే రూ. 100 ఫైన్ వేయాలని తెలిపారు. s
Tags:    

Similar News