టెలికాం రంగంలో జియోతో సంచలనాలు సృష్టించిన రిలయెన్స్.. ఇప్పుడు మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇండియాలో అత్యంత విలువైన కంపెనీగా రిలయెన్స్ ఇండస్ట్రీస్ నిలిచింది. ఇంతవరకు తొలి స్థానంలో ఉన్న టీసీఎస్ ను ముకేశ్ కంపెనీ వెనక్కి నెట్టింది. మంగళవారం రిలయెన్స్ షేరు 1.36 శాతం లాభపడి రూ.1410కి చేరింది. దీంతో కంపెనీ మొత్తం విలువ రూ.4.58 లక్షల కోట్లకు చేరింది. బీఎస్ ఈ ఇంట్రాడేలో రిలయెన్స్‌కు ఇదే అత్యధిక స్థాయి. మరోవైపు టీసీఎస్ విలువ మాత్రం రూ.4.56 లక్షల కోట్లకు పడిపోయింది. ఆ కంపెనీ షేరు ధర 0.25 శాతం పతనమై రూ.2315కు చేరింది. ఈ మూడు నెలల్లో రిలయెన్స్ షేర్లు 35 శాతం పెరగగా.. టీసీఎస్ మాత్రం కేవలం 2 శాతం లాభపడింది.
ఏప్రిల్ నుంచి జియోకి చార్జీలు వసూలు చేస్తామని రిలయెన్స్ ప్రకటించినప్పటి నుంచీ ఆ కంపెనీ షేర్ల ధర పెరుగుతూ వస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. 2500 కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టినా.. కస్టమర్లకు ఉచితంగా అన్ని సేవలు అందిస్తుండటంతో చాలా కాలం వరకు జియోపై ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో కంపెనీ షేర్లు పతనమవుతూ వచ్చాయి. అయితే మార్చి 31నాటికి ఏడు కోట్లకుపైగా కస్టమర్లు జియో పెయిడ్ సర్వీసెస్ కు ఎన్ రోల్ చేసుకోవడంతో రిలయెన్స్ షేర్లు దూసుకెళ్లాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/