"ఇస్తామని చెప్పిన ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లు (పిఒఐ) సరిగ్గా ఇవ్వకుండా ఎయిర్ టెల్ మోసం చేస్తుంది... అవసరాల కంటే ఎక్కువ ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లే ఇచ్చాము - జియో టెక్నాలజీలోనే లోపం ఉందేమో..." ఇది ప్రస్తుతం దేశంలోని రెండు బడా టెలికమ్ ఆపరేటర్లు అయిన ఎయిర్ టెల్ - రిలయన్స్ జియోల మధ్య కొనసాగుతున్న మాటల యుద్దాలు. ఇస్తామని చెప్పిన ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లు (పిఒఐ) కూడా ఇవ్వకుండా ఎయిర్ టెల్ మోసం చేసిందని రిలయన్స్ జియో ఆరోపిస్తుంటే... జియో ఆరోపణలను తోసిపుచ్చిన ఎయిర్ టెల్... జియో అవసరాల కంటే ఎక్కువ ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లే ఇచ్చామని, ఈ నెల 13నే అంతకు ముందున్న పాయింట్ల కంటే మూడింతలు పెంచామని చెబుతుంది.. ఈ మధ్యలో రెండు నెట్ వర్కులకు సంబందించిన కస్టమర్లు మాత్రం ఇబ్బంది పడుతున్నారు!!
ఎయిర్ టెల్ కనెక్టివిటీ పాయింట్లు ఎక్కువగా ఇవ్వనందువల్ల రోజూ రెండు కోట్లకు పైగా కాల్ డ్రాప్స్ నమోదవుతున్నాయని, నంబర్ పోర్టబులిటీ కింద ఎయిర్ టెల్ నుంచి రిలయన్స్ జియో నెట్ వర్క్ కు మారే వినియోగదారులకు కావాలనే ఎయిర్ టెల్ ఇబ్బందులు గురి చేస్తోందని జియో ఆరోపిస్తుంది. ఈ విషయంలో ట్రాయ్ జోక్యం చేసుకోవాలని జియో విజ్ఞప్తి చేసింది. రెండు నెట్ వర్క్ ల మధ్య కాల్స్ పూర్తయ్యేందుకు అవసరమైన ఇంటర్ కనెక్టివిటీ పాయింట్స్ లో నాలుగో వంతు మాత్రమే ప్రస్తుతం ఎయిర్ టెల్ తమ నెట్ వర్క్ కోసం ఇచ్చిందని జియో తెలిపింది. తాము ఇప్పటికే అందిస్తున్న ఇంటర్ కనెక్టివిటీ పాయింట్లతో రిలయన్స్ జియో 1.5 కోట్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులకు కాల్ డ్రాప్స్ లేకుండా సేవలు అందించ వచ్చని.. ప్రస్తుతం జియోకు ఉన్న 10 కోట్ల ఖాతాదారుల అవసరాల కన్నా ఈ పాయింట్స్ ఎక్కువేనని ఎయిర్ టెల్ చెబుతుంది.
కాగా.. జియో అందిస్తున్న్ ఆఫర్స్ తో చాలా మంది ఎయిర్ టెల్ వినియోగదారులు నెంబర్ పోర్టబులిటీ ద్వారా రిలయన్స్ జియోకు మారుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై రిలయన్స్ జియో - ఎయిర్ టెల్ మధ్య గత కొన్ని రోజులుగా జరుగుతున్న మాటల యుద్దాలు తారాస్థాయికి చేరినట్లయ్యింది.