భారతదేశ టెలికాం రంగంలో దిగ్గజంగా వెలుగొందుతున్న రిలయన్స్ జియో యూజర్లకు అదిరిపోయే షాక్ ఇచ్చింది. టెలికాం రంగంలోకి జియో వచ్చాక ఇప్పటి వరకు వాయిస్ కాల్స్‌కు చార్జీలు వసూలు చేయడం అన్నది లేదు. నెలవారి ప్యాకేజ్ లను తీసుకుంటూ డైలీ ఆ మేరకు డేటా ఫ్రీగా లభించడంతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకునే సౌకర్యం ఇప్పటి వరకు ఉంది. ఇక రోజుకో ఆఫర్ తో ఇప్పటికే భారత్ లో అతి తక్కువ టైంలోనే కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకున్న జియో ఇప్పుడు చార్జీల బాదుడు స్టార్ట్ చేసేసింది.
జియో నెట్ వర్క్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జియో నెట్ వర్క్ నుంచి ఇతర నెట్ వర్క్ నంబర్లకు ఫోన్ చేస్తే నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తారు. దీనిపై అధికారిక నిర్ణయం తీసుకున్నారు. అంటే 10 నిమిషాలు మాట్లాడితే 60 పైసల వరకు కట్ అవుతుంది. ఓ విధంగా ఇది తక్కువ మొత్తమే అయినా ఇది భవిష్యత్తులో పెరిగే ఛాన్స్ కూడా లేకపోలేదు. యూజర్లను క్రమక్రమంగా తమ నెట్ వర్క్ ముగ్గులోకి దింపాక ఇప్పుడు చార్జీలు వసూలు చేయడం స్టార్ట్ చేసింది. గతంలోనే ఈ అనుమానాలు ఉండగా ఇప్పుడు జియో ఇది నిజం చేసింది.
అయితే ఎంత మొత్తం వసూలు చేస్తారో ? అంత మొత్తానికి తగిన డేటాను ఫ్రీగా ఇస్తామని కూడా జియో ప్రకటించింది. గురువారం నుంచి ఈ చార్జీలు అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో ఈ చార్జీలు జియో టు జియో నెట్ వర్క్ కు వర్తించవు. జియో నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు కాల్ చేసినప్పుడు మాత్రమే వర్తిస్తాయి.
ఇతర నెట్ వర్క్ లకు కాల్స్ చేసుకునే వారు రీచార్జ్ చేసుకునే సమయంలో అదనంగా ఐయూసీ టాప్ అప్ వోచర్ ను కూడా కొనుగోలు చేయాలి. ఈ చార్జీలు జియో ప్రి పెయిడ్ కస్టమర్లతో పాటు జియో పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు కూడా వర్తిస్తాయి. ఇక జియో టు జియో ఫోన్ నంబర్లకు గానీ.. ల్యాండ్ లైన్ కాల్స్ - వాట్సాప్ కాల్స్ కు ఈ చార్జీలు వర్తించవు. ఇన్ కమింగ్ కాల్స్ కూడా ప్రీ.