సముద్ర నాచుతో కరోనాకి చెక్ ? ఎవరు చెప్పారంటే ?

Update: 2020-04-13 07:45 GMT
ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మొక్కలో ఒక ఔషధ గుణం ఉంటుంది. అయితే , మనకి భూమి పై ఉండే   మొక్కలు, వాటిలో ఔషధ గుణాల గురించి మనకు తెలుసు. ఐతే... సముద్రాల్లో ఉండే మొక్కల విశేషాలు కొంతవరకే తెలుసు. అయితే , సముద్రంలో ఉండే డే ఓ రకమైన ఎరుపు రంగు నాచుకు కరోనా వైరస్‌ను అడ్డుకునే శక్తి ఉందని ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌ పమెంట్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

పొర్ఫీరీడియం సల్ఫేటెడ్‌ రకపు ఎరుపు నాచు నుంచి ఉత్పత్తి అయ్యే పాలీ శాకరైడ్‌ లు ..శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌ లను అడ్డుకొని, బలమైన యాంటీ వైరల్‌ ఏజెంట్లుగా పనిచేస్తాయని గుర్తించారు. అందువల్ల ఈ నాచుతో యాంటీ వైరల్‌ మందుల తయారీతో పాటు శానిటరీ వస్తువులపై వైరస్‌ చేరకుండా కోటింగ్‌‌ లా వేయవచ్చని తమ రీసెర్చ్ లో  తెలిపారు.

మరోవైపు రిలయన్స్‌ లైఫ్‌ సైన్సెస్‌ కూడా కరోనా నిర్ధారణ పరీక్షల కిట్ల అభివృద్ధిపై దృష్టిసారించినట్లు సమాచారం. తొలిదశగా వాటితో గ్రూపు ఉద్యోగులకు పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాత మార్కెట్‌ లోకి విడుదల చేస్తారని తెలుస్తోంది. కరోనా వైరస్‌ కి ప్రస్తుతానికి సరైన మందు లేదు. ఇతర వైరస్‌ లకు వాడే మందుల్నే వీటికీ వాడుతున్నారు. ఇకపోతే  ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 18 .5 లక్షల మంది ఈ మహమ్మారి భారిన పడగా ..114,270 మంది మృతి చెందారు.
Tags:    

Similar News