కరోనా.. లాక్ డౌన్ అందరిపైనా ప్రభావం చూపాయి. కానీ.. కోలుకోలేనంత దారుణంగా దెబ్బ తీసిన రంగాలు ఉన్నాయి. ఆ కోవలోకి వస్తుంది హైదరాబాద్ మెట్రో. ప్రాజెక్టు వ్యయం తడిచిమోపెడు కావటం.. అనుకున్న సమయానికి ఓపెన్ కాకపోవటం ఒక ఎత్తు అయితే.. ఓపెన్ అయిన తర్వాత.. అన్ని కారిడార్లు అనుకున్నట్లుగా ప్రారంభం కాకపోవటం.. ఈ ప్రాజెక్టు ప్రారంభంలో వేసుకున్న అంచనాలు కొన్ని తప్పు కావటంతో ఆర్థిక ఇబ్బందులతో కిందామీదా పడుతోంది.
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుకు ప్రభుత్వ దన్ను అవసరమన్న మాట వినిపిస్తున్నప్పటికీ.. అందుకు తగ్గట్లు ప్రభుత్వం పెద్దగా రియాక్టు అవుతున్నది లేదు. ఇలాంటివేళ విరుచుకుపడిన కరోనా కారణంగా మెట్రో సర్వీసుల్ని నెలల తరబడి నిలిపివేయటం తెలిసిందే. ఈ మధ్యనే ఎత్తేసిన లాక్ డౌన్ పుణ్యమా అని.. మెట్రోను నడిపిస్తున్నారు. అయితే.. రాత్రి తొమ్మిది గంటల వరకే మెట్రోను నడుపుతున్న కారణంగా.. హైదరాబాదీల అవస్థలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
రాత్రిళ్లు ఆఫీసుల నుంచి ఆలస్యంగా బయటకు వచ్చే వారికి మెట్రో సదుపాయంలేకపోవటంతో ఇబ్బందులకు గురవుతున్నారు. లాక్ డౌన్ ఎత్తేసి సాధారణ పరిస్థితులు నెలకొని ఉన్న వేళ.. మెట్రో వేళల్ని సైతం పొడిగించాలన్న డిమాండ్ తెర మీదకు వచ్చింది. దీనిపై తాజాగా హైదరాబాద్ మెట్రో సానుకూలంగా స్పందించింది. ఇప్పటివరకు ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి తొమ్మిది గంటలకు బయలుదేరే చివరి ట్రైన్ వేళల్ని మార్చారు.
దీంతో.. రాత్రి 10.45 గంటల వరకు మెట్రోలో ప్రయాణించే వీలు కలుగుతుంది. పెంచిన ప్రయాణ వేళలు ఈ రోజు (శుక్రవారం) నుంచే అమల్లోకి వస్తాయని మెట్రో వెల్లడించింది. దీంతో.. రాత్రిళ్లు మెట్రోలో ప్రయాణించలేకపోతున్నామని బాధ పడుతున్న వారికి.. తాజాగా పొడిగించిన వేళలు సాయం చేస్తాయని చెప్పక తప్పదు.