రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారటమే కాదు.. కంటతడి పెట్టించేలా చేసిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ముగ్గురు నిందితుల్ని అరెస్ట్ చేయటం తెలిసిందే. తాజాగా పోలీసులు సిద్ధం చేసిన రిమాండ్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఇందులో షాకింగ్ అంశాల్ని పోలీసులు ప్రస్తావించారు. వివేకాను దారుణంగా.. క్రూరంగా హింసించి చంపినట్లుగా రిమాండ్ రిపోర్ట్ చెబుతోంది.
వివేకానంద మృతదేహంపై ఏడు చోట్ల పదునైన.. లోతైన గాయాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. మృతదేహం మీద ఉన్న గాయాలు.. వాటి లోతును.. తీవ్రతను విశ్లేషించిన నిపుణులు.. వివేకాను ప్రమాదకరమైన ఆయుధంతో తలపై దాడి చేసి చంపినట్లుగా పేర్కొన్నారు. వివేకా హత్యకు సంబంధించిన వివరాలతో పాటు.. వివేకాను హత్య చేసిన దోషులు ఎవరన్న విషయం గంగిరెడ్డి.. ములి వెంకటకృష్ణారెడ్డి.. ఎద్దుల ప్రకాష్ కు తెలుసని పేర్కొన్నారు.
దోషుల్ని చట్టం నుంచి తప్పించేందుకు వీలుగా వీరు ముగ్గురు ఉద్దేశపూర్వకంగానే నేరస్తుల్ని ఘటనాస్థలం నుంచి తప్పించటమే కాదు..ఆధారాలు కూడా కనిపించకుండా చేశారని పేర్కొన్నారు. ఈ హత్య కేసులో మరికొందరు వ్యక్తుల ప్రమేయం ఉందని.. చాలామంది సాక్ష్యుల్ని విచారించాల్సిన అవసరం ఉందన్నారు.
పులివెందుల ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో పోలీసులు సమర్పించిన రిమాండ్ నోట్ లో కొన్ని కీలక అంశాల్ని చూస్తే..
+ వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు (15.03.2019) ఉదయం 5.30 గంటలకు ఆయన వ్యక్తిగత సహాయకుడు ములి వెంకటకృష్ణారెడ్డి ఆయన ఇంటికెళ్లారు. వివేకా ఇంటి నుంచి బయటకు రాకపోవటంతో కృష్ణారెడ్డి బయట కూర్చొని అరగంట పాటు దినపత్రికలు చదువుకున్నారు. ఆ తర్వాత వివేకా భార్య సౌభాగ్యమ్మకు ఫోన్ చేసి వివేకా నిద్రలేవలేదని - ఫోన్ చేసి లేపాలన్నారు.వెంటనే లేపొద్దని ఆమె సూచించారు.
+ మరో అరగంట తర్వాత వంటమనిషి లక్ష్మి, ఆమె కుమారుడు ప్రకాశ్ లు వివేకా ఇంటి వద్దకు చేరుకున్నారు. కృష్ణారెడ్డి సూచన మేరకు వారిద్దరూ వివేకాను నిద్ర లేపేందుకు పలుమార్లు పిలవగా స్పందన లేదు. అయితే.. ఇంటి పక్క డోరు తెరుచుకుని ఉందని వాచ్ మెన్ రంగన్న చెప్పటంతో వెంకటకృష్ణారెడ్డి - ప్రకాశ్ కలిసి ఇంట్లోకి వెళ్లారు.
+ వారు లోపలికి వెళ్లగా.. పడక గదిలో రక్తం కనిపించింది. చుట్టూ వెతగ్గా వివేకా బాత్ రూమ్ లో రక్తపుమడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత బయటకొచ్చి వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, - భార్య వై.ఎస్.సౌభాగ్యమ్మకు ఫోన్ చేసి వివేకా మృతి విషయాన్ని తెలిపారు.
+ వివేకా మృతదేహంపై ఏడుచోట్ల పదునైన - లోతైన గాయాలున్నాయి. వాటి ఆధారంగా వివేకాది హత్యగా గుర్తించి.. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమెదు చేశాం.
+ వివేకా పడకగది - స్నానపుగదిలోని రక్తపు మరకలను శుభ్రపరిచేందుకు వినియోగించిన ప్లాస్టిక్ బకెట్ - తడిగుడ్డ - అక్కడున్న వెంట్రుకలు - బొట్టు స్టిక్కర్లతో పాటు వెంకటకృష్ణారెడ్డి దగ్గర నుంచి వివేకాకు చెందిన రెండు సెల్ ఫోన్లు - లేఖ తదితరాలను స్వాధీనం చేసుకున్నాం.
+ ఈ కేసులో ప్రధాన నిందితుణ్ని గుర్తించేందుకు మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంది. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసి.. హత్య చేసిన వారు తప్పించుకొనేందుకు సహకరించిన వీళ్లకు బెయిల్ ఇవ్వొద్దు. 15 రోజులు ముగ్గుర్ని పోలీసు కస్టడీకి ఇవ్వాలి.