ఒక్కసారి కానీ వెహికిల్ హైవే మీదకు ఎక్కితే యాక్సిలేటర్ ను ఎంత వత్తాలో అంత మేర వత్తేయటం మామూలైంది. దీనికి తోడు అందుబాటులోకి వస్తున్న ఖరీదైన కార్ల పుణ్యమా అని.. గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల స్పీడ్ తో వాహనాల్ని నడిపే వారున్నారు. మరికొందరైతే అంతకు మించిన వేగాన్ని నమోదు చేస్తుంటారు. ఇలా జెట్ స్పీడ్ తో దూసుకెళ్లే వాహనాలకు.. హైవే మధ్యలో ఉండే స్పీడ్ బ్రేకర్ల కారణంగా పెద్దఎత్తున ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
వేగ నియంత్రణకు మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు మంచిదేనన్న అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం హైవేల్లో స్పీడ్ బ్రేకర్లు ఏ మాత్రం మంచిది కాదన్న మాట బలంగా వినిపిస్తుంది. తాజాగా ఇదే అంశంపై కేంద్రం ఒక స్పష్టతను ఇచ్చేసింది. హైవేల మీదున్న స్పీడ్ బ్రేకర్లను వెంటనే తొలగించాలన్న నిర్ణయాన్ని తీసుకుంది. స్పీడ్ బ్రేకర్ల వల్ల సమస్యలు చోటు చేసుకుంటున్నాయని.. ఒక్క 2014 ఏడాదిలో స్పీడ్ బ్రేకర్ల కారణంగా దేశ వ్యాప్తంగా 4,700మంది మరణించినట్గు తేల్చారు. ఈ నేపథ్యంలో హైవేల మీద స్పీడ్ బ్రేకర్లను వెంటనే తొలగించాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. సో.. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే.. బండి కానీ హైవే ఎక్కితే.. ఎవరి స్పీడ్ వారే కంట్రోల్ చేసుకోవాల్సిందేనన్న మాట.