ప్రజలను అప్పుల్లో ఊబిలోకి లాగి వాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్న లోన్ యాప్స్‌ను వెంటనే ప్లే స్టోర్, గూగుల్ నుంచి తీసేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి సూచించింది. ఇటీవల లోన్‌యాప్‌లతో తెలంగాణలో కొందరు ఆత్మహత్యలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉన్నది. ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశారు. అయితే ఈ యాప్‌లు మాత్రం ఇంకా ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కళ్యాణ్ దిలీప్ అనే లాయర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రజలను అప్పుల ఊబిలోకి లాగుతున్న లోన్‌యాప్స్‌ను వెంటనే తొలగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని సదరు లాయర్ పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు సంచలన నిర్ణయం తీసుకున్నది.
చైనీయులు అజమాయిషీలో నడుస్తున్న లోన్‌యాప్‌లు ఇంకా ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్‌ల నిర్వాహకులు వేధింపులు తాళలేక చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని పిటిషన్లో ఆరోపించారు.
లోన్‌యాప్‌లపై ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో అనేక కేసులు నమోదయ్యాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. వెంటనే ఈ యాప్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని.. యాప్ నిర్వాహకులను కట్టడి చేయాలని కోరారు. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 18కి వాయిదా వేశారు.