మీడియాలోకి రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారంతో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు - మాజీ మంత్రి రేణుక చౌదరి ఇటీవల తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. తనతో వెంట తీసుకువెళ్లిన పనమ్మాయిని పట్టించుకోకుండా ఆమె నిల్చోని చూస్తుండగానే రేణుక భోజనం చేస్తున్నారని - ఆమె నిర్లక్ష్య తీరుకు ఇదే నిదర్శనమని నెటిజన్లు ఫైరయ్యారు. అయితే అసలు నిజం ఏంటో చెప్తూ నెటిజన్ల తీరుపై రేణుక కూతురు తేజస్విని మండిపడ్డారు.
ఆ రోజు సంఘటన తాలుకు ఫొటో సగం మాత్రమే చూసి తన తల్లిపై ఆరోపణలు చేశారని తేజస్విని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తన తల్లికి పనిమనిషి కాదని పేర్కొంటూ తనకోసమే ఆమెను నిమమించారని తెలిపారు. అంతేకాకుండా ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి బాలిక కాదని 26 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ అని తేజస్విని స్పష్టం చేశారు. అంతేకాకుండా సదరు పనిమనిషికి ఇద్దరు పిల్లలున్నారని అందులో ఒకరి వయసు 9 ఏళ్లు కాగా మరొకరి వయసు ఏడేళ్లని వివరించారు. తాము రెస్టారెంటుకు వెళ్లినపుడు పనిమనిషికి కూడా భోజనం పెట్టించామని తేజస్విని చెప్పారు.
ఇదే సమయంలో నాయకురాలైన రేణుకాచౌదరి ఒక తల్లిగా కూడా ఎలా వ్యవహరిస్తారో తేజస్విని వివరించారు. తన తల్లి రాజకీయవేత్తగానే కాకుండా మంచి మనసున్న మనిషి అని పేర్కొంటూ ఇప్పటికీ ఆత్మీయంగా అందరి అవసరాలను తీరుస్తుందని, ఈ విషయం బయటి వారికి చాలమందికి తెలియదని చెప్పారు. ఇలాంటి వాస్తవాలు తెలుసుకోకుండా కామెంట్లు చేసి ఎదుటివారిని గాయపర్చవద్దని తేజస్విని కోరారు.