రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ లేని భారత్ నినాదం తనది కాదని, గాంధీజీదేనని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రేణుకా చౌదరి బిగ్గరగా నవ్వడంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వారించారు. రేణుకకు ఏదైనా సమస్య ఉంటే డాక్టర్ దగ్గరకెళ్లాలని, సభలో అనుచిత ప్రవర్తనను సహించబోనని అన్నారు. దానికి, ప్రధాని వెటకారంగా స్పందించారు. రేణుకాజీని నవ్వనివ్వాలని, అప్పట్లో రామాయణం సీరియల్ లో అలాంటి నవ్వులు విన్నామని, మళ్లీ ఇపుడు మరోసారి వింటున్నామని సెటైర్ వేయడంతో సభలో నవ్వులు వెల్లివిరిసాయి. అయితే, ఆ వ్యాఖ్యలపై రేణుక మండిపడుతున్నారు. మోదీ తనపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశించగలమని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయన స్థాయికి దిగజారి తాను బదులివ్వలేనని , ఇది మహిళలను కించపరిచడమేనని మండిపడ్డారు.
రేణుక వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ బ్రాండ్ - కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఘాటుగా బదులిచ్చారు. మోదీపై రేణుక అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆమెపై ఎదురుదాడి చేశారు. ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని, మోదీపై ఆమె అమర్యాదకరమైన వ్యాఖ్యలు చేయడం తాను విన్నానని అన్నారు. రేణుక...ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన వాటిని తిప్పికొట్టడం సమంజసమేనని సమర్థించారు. రేణుక......మహిళ అనే కవచాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడడం సమంజసమా అని ప్రశ్నించారు.