'కమ్మ' ని బాధ

Update: 2018-11-14 14:30 GMT
తెలంగాణ ముందస్తు ఎన్నికల సంధర్భంగా పార్టీలు నియోజకవర్గాలలోని తమ అభ్యర్దులను ప్రకటిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల శంఖారావం పూరించిన వెంటనే తన అభ్యర్దులను ప్రకటించింది. మహాకూటమి కూడా మొదట విడతగా 65 మంది అభ్యర్దులను ప్రకటించింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ రెడ్డి సామాజకి వర్గ పార్టీగాను, తెలుగుదేశం కమ్మ సామజిక వర్గ పార్టీగాను తెలుగు రాష్ట్రాలలో ముద్ర వేసుకున్నాయి. మహాకూటమిలో తెలంగాణలో తమ అభ్యర్దులను ప్రకటించిన కాంగ్రెస్‌ పార్టీలో ఒక్క కమ్మ సామాజిక వర్గం అభ్యర్ది కూడా లేకపోవడం గమనార్హం. టిక్కెట్లు దక్కని అభ్యర్దులు తమకు దక్కలేదని బాధపడడం కొంచెం సబాబుగానే ఉంటుంది. కాని తమ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరికీ కూడా టిక్కెట్టు దక్కలేదని గగ్గోలు పెడుతున్నారు కమ్మ సామాజకి వర్గానికి చెందిన నేతలు...అలాగే బీసీ నాయకులు కూడా తమ కులానికి ఎక్కువ టిక్కెట్లు కేటాయించాలని పట్టుబడుతున్నారు. రాజకీయ నాయకులు కూడా కుల సంఘాల నేతలతో ప్రత్యేకంగా మాట్లడి వారి ఓట్ల కోసం ప్రాకులాడుతున్నారు.అయితే జాతీయ స్దాయిలో  తన కంటూ ఒక ముద్ర వేసుకున్న రేణుక చౌదరి.. టిక్కెట్లు ఇచ్చిన తీరును బహిరంగంగానే తప్పు పట్టారు. ఖమ్మం జిల్లా అంటే కమ్మ సామాజిక వర్గనికి చెందిన వారికే టిక్కెట్లు ఇస్తారని ఆశించారు రేణుక చౌదరి. కాని టిక్కెట్లు వేరొకరు ఎగర వేసుకు పోవడంతో... టిక్కెట్లు ఇచ్చిన తీను అస్సలు బాగోలేదంటూ బహరంగ విమర్శలు చేసారు .‌ఖమ్మం జిల్లాకు తమ సామాజిక వర్గానికి చెందిన వారేవరూ ప్రాతినిత్యథ్యం వహించకపోవడంతో ఆవిడ కీనుక వహించారు. అలాగని రేణుక చౌదరి కాంగ్రెస్ పార్టీని కూడా డైరెక్టగా ఏమి అనలేకపోతున్నారు. రేణుక చౌదరి ముందస్తు ఎన్నికలలో పోటి చేద్దామని అనుకోలేదు. కాని కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకుడికి టిక్కెట్లు కోసం మాత్రం విశ్వప్రయత్నం చేసి భంగ పడినట్లు తెలుస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీని విమర్శించలేక...తన సామాజిక వర్గ నాయకుడికి టిక్కెట్లు ఇప్పించుకోలేక ఎటూ చెప్పలేని పరిస్దితిలో రేణుక చౌదరి సతమతమవుతున్నారు. అయితే ఏది  ఏమైన కూడా తన మిత్రపక్షాల గెలుపు కోసం తాను ముందుంటానని తేల్చేసారు.
    

Tags:    

Similar News