సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీలో ఈ నెల 11న జరిగిన పోలింగ్ లో పెద్ద ఎత్తున విమర్శలు రేకెత్తాయి. ఈవీఎంల పనితీరుపై అధికార పార్టీ తనదైన శైలి విమర్శలు చేస్తే... విపక్ష వైసీపీ కూడా తమపై దాడులు చేశారంటూ వాపోయింది. ఈవీఎంలలో తలెత్తిన లోపాల పుణ్యమా అని చాలా ప్రాంతాల్లో రాత్రి పొద్దు పోయిన తర్వాత కూడా పోలింగ్ జరిగింది. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఇటు టీడీపీతో పాటు అటు వైసీపీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి.
ఈ క్రమంలో తమకు అందిన ఫిర్యాదులు, ఆ ఫిర్యాదుల్లోని అంశాలను పరిశీలించిన ఎన్నికల సంఘం... రీ పోలింగ్ ను కేవలం ఐదంటే ఐదు స్థానాల్లోనేనని తేల్చి పారేసింది. ఈ మేరకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ కాసేపటి క్రితం రీ పోలింగ్ కు సంబంధించి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని ైదు చోట్ల మాత్రమే రీ పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్న ఆయన రీ పోలింగ్ జరిగే ప్రాంతాలను కూడా వెల్లడించేశారు. నెల్లూరు జిల్లాల్లో రెండు, గుంటూరు జిల్లాలో రెండు, ప్రకాశం జిల్లాలో ఓ చోట మాత్రమే రీ పోలింగ్ నిర్వహించనున్నట్లుగా ఆయన ప్రకటించారు.
ఈ మేరకు ఈ ఐదు చోట్ల మాత్రమే రీ పోలింగ్ నిర్వహించాలని ఈసీకి నివేదిక పంపినట్లుగా ఆయన వెల్లడించారు. తీవ్ర ఉద్రిక్తతలు, పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపించిన నేపథ్యంలో రీ పోలింగ్ కేంద్రాల సంఖ్య చాలానే ఉంటుందని అంతా అంచనా వేసినా... రీ పోలింగ్ ను కేవలం ఐదు స్థానాలకు మాత్రమే పరిమితం చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.