రొటీన్.. రొటీన్.. రొటీన్ గా ఆలోచించొద్దు.. ఏమైనాసరే వెరైటీగా ఆలోచించండి అన్నట్లుగానే ఆలోచించింది చైనాలోని ఒక జంట. వీరే ఇలా ఆలోచిస్తున్నారు.. ఇంక నేను ఎలా ఆలోచించాలి అనుకున్నాడు సీఎం లెంగ్! వెరైటీ మరీ ఎక్కువ కావడంతో పరిస్థితి ప్రాణం మీదకు వచ్చింది. భూమిపై ఇంకా నూకలు ఉండటంతో పరిస్థితి కాస్తలో మిస్ ఆయింది. ఇలా పొడిపొడిగా తెలుసుకోవడం ఎందుకు కానీ.. విషయంలోకి వెళ్లిపోదాం!
చైనాకు చెందిన ఒక కొత్త జంట అందరిలా కాకుండా వెరైటీగా పెళ్లిఫోటోలు దిగాలని భావించారు.. అనుకున్నదే తడవుగా ప్రపంచంలోనే బెస్ట్ ఫోటోగ్రాఫర్లలో ఒకరైన సీఎం లెంగ్ ను ఎంపిక చేసుకున్నారు. దీంతో వెరైటీగా ఆలోచించిన అతడు కూడా వారిద్దరినీ ఐస్ లాండ్ కు తీసుకువెళ్లి - ప్రకృతి అందాల నడుమ - రమణీయ ప్రదేశాల్లో ఆ వధూవరుల ఫోటోలను వివిధ భంగిమల్లో తీశాడు. ఇంతవరకూ సజావుగానే సాగింది కానీ.. నదీతీరంలో జరిగిన ఆఖరి ఫోటోషూట్ మాత్రం ప్రమాదకరంగా మారింది.
నదీతీరం అంటే కేవలం వాటర్ - స్కై మాత్రమే కాదు.. అంతకు మించిన లుక్ ఉండాలని వెరైటీగా భావించిన కెమెరామెన్ కోస్టల్ గార్డ్ హెలీకాప్టర్ ఒకదానిని అద్దెకు తీసుకున్నాడు. ఆ నదీ తీరంలో హెలీకాప్టర్ బ్యాగ్రౌండ్ లో ఫోటోలు తీయాలనేది అతడి కోరిక. అలా ఫోటోలు తీస్తుండగా.. పెళ్లిదుస్తుల్లో మిలమిల మెరిసిపోతున్న పెళ్లికూతురు తలపైకి హెలీకాఫ్టర్ వచ్చేసరికి... రెక్కల గాలికి వదువు కిందపడిపోయింది. ఈ క్రమంలో హెలీకాప్టర్ రెక్కల్లో ఆమె ధరించిన వెయిల్ ఇరుక్కుపోయింది. ఏమి జరుగుతుందో తెలుసుకునేలోపు పైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఘోరప్రమాదాన్ని తప్పించాడు. కొసమెరుపేమిటంటే.. ఇంతటి ప్రమాదకరమైన పరిస్థితిలో కూడా అద్భుతమైన ఫోటోలు తీసి కొత్త జంట కోపాన్ని ఆనందంగా మార్చాడు ఫోటోగ్రాఫర్ సీఎం. వెరైటీగా ఆలోచించొచ్చు కానీ.. మరీ ఈ స్థాయిలో కాదని తర్వాత భావించి ఉంటారు కదా ఆముగ్గురూ!!
Full View