బ్రేకింగ్ : తెలంగాణ మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే

Update: 2020-01-05 09:41 GMT
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంది. ఆదివారం తెలంగాణలోని కార్పొరేషన్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. రాష్ట్ర పురపాలక సంచలకులు శ్రీదేవి ఆదివారం ఆయా కార్పొరేషన్ల రిజర్వేషన్ల వివరాలు వెల్లడించారు.

తెలంగాణలో మొత్తం 13 కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో జనరల్ -7, బీసీ-4, ఎస్సీ-1, ఎస్టీ-1కి చొప్పున కేటాయించినట్లు పురపాలక సంచలకులు శ్రీదేవి మీడియాకు తెలిపారు. నిజామాబాద్, బండ్లగూడ, జవహర్ నగర్ నగరపాలక సంస్థ మేయర్ పదవులను బీసీలకు కేటాయించారు. మీర్ పేట్ మేయర్ పదవిని ఎస్టీకి కేటాయించారు. పాల్వంచ, మందమర్రి, మణుగూరు రిజర్వేషన్లను ప్రకటించలేదు.

*తెలంగాణలో కార్పొరేషన్ల రిజర్వేషన్ల లెక్క ఇదీ..

జనరల్‌ (ఎవరైనా పోటీచేయవచ్చు) : బండాగ్ పెట్, కరీంనగర్, బొడుప్పల్, పిర్జాదిగూడ. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నిజాంపేట మున్సిపాలిటీలు
బీసీ: జవహర్ నగర్, వరంగల్, నిజామాబాద్, బండ్లగూడ
ఎస్సీ: రామగుండం
ఎస్టీ : మీర్ పేట

+తెలంగాణలో మున్సిపాలిటీల రిజర్వేషన్లు
* బీసీ రిజర్వుడు మున్సిపాలిటీలు:
సిరిసిల్ల, నారాయణ పేట, కోరుట్ల, చండూరు, భీంగల్, ఆందోల్, కొల్లాపూర్, యాదగిరిగుట్ట, నిర్మల్,  కిసిగి, రాయికల్, పోచంపల్లి, రమాయపేట, బోధన్, సదాశివ పేట, ఆర్ముర్, మెటపల్లి, గద్వాల్, ఎల్లారెడ్డి, సంగారెడ్డి, వనపర్తి, సుల్తానాబాద్, నర్సంపేట, కిదంగల్, తుఫ్రాన్, ఆలేరు, భువనగిరి.

*ఎస్సీ రిజర్వుడు మున్సిపాలిటీలు

కేతనపల్లి - బెల్లంపల్లి - మధిర - పరకాల - వైరా - నస్కురు - అలంపూర్ - తోర్రుర్ - నార్సింగి - పెద్ద అంబర్ పేట - ఐజా - పెబ్బేరు - నెరుడుచెర్ల - వడ్డేపల్లి - భూపాలపల్లి - తిరుమలగిరి

*ఎస్టీ రిజర్వుడు మున్సిపాలిటీలు : డోర్నకల్ - మరిపెడ - దోర్నాల్ - వర్ధన్నపేట - అమన్ గల్

మిగతా మున్సిపాలిటీలన్నింటిని జనరల్ గా ప్రకటించారు.

మున్సిపాలిటీ రిజర్వేషన్లపై పూర్తి జాబితాను కింద చూడొచ్చు.
Tags:    

Similar News