అనుకోకుండా సినీ రంగ ప్రవేశం జరిగిందంటూ చాలా మంది నటీమణులు చెబుతుంటారు. కానీ, రాజకీయ ప్రవేశం అనుకోకుండా చేశానని చెబుతున్నారు వర్ధమాన నటి రేష్మా రాథోడ్. ‘ఈ రోజుల్లో’ సినిమాతో వెండితెరకు పరిచమైన ఆమె - బీజేపీ అభ్యర్థిగా వైరా నుంచి బరిలోకి దిగారు.
రేష్మా స్వగ్రామం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి. తండ్రి సింగరేణిలో ఉన్నత ఉద్యోగి. తల్లి హై కోర్టు లాయర్. ఆ కారణాల వల్ల ఎప్పుడూ పేదలు ఇంటికి వచ్చే పోయే వారని.. సేవ చేయాలనే బీజం చిన్నప్పటి నుంచే పడిందని అంటున్నారు ఆమె. న్యాయ వృత్తిలోకి ప్రవేశిద్దామనుకుని లా కూడా పూర్తి చేశారు. సినిమాల్లో అవకాశం రావడంతో వెండితెరపై తళుక్కుమన్నారు.
ప్రజా సేవలో చుట్టూనే చిన్ననాటి జీవితం గడిచిందని - మరింత మందికి సేవలందించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యేగా వైరా నుంచి పోటీ చేస్తున్నట్లు రేష్మ చెప్పుకొచ్చారు. కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చాలా పథకాలు ప్రజలకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని అన్నారు. ముఖ్యంగా రూ.5లక్షల వరకు వైద్య సేవలందించే ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తొక్కి పెట్టిందని విమర్శించారు. ఈ పథకాలన్నీ సక్రమంగా ప్రజలకు చేరాలంటే బీజేపీ ప్రభుత్వం రావాల్సిందేనని గట్టిగా చెబుతున్నారు.
తల్లిదండ్రుల చరిష్మా - సినీ గ్రామర్ కు తోడు మోడీ ప్రవేశపెడుతున్న పథకాలు గట్టెక్కిస్తాయని రేష్మ భావిస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో కూడా చాలా మార్పులు జరగాల్సి ఉందని అంటున్నారు. ఎస్టీల అభ్యున్నతి - బయ్యారం ఉక్కు కార్మాగారం సాధనకు కృషి చేస్తానని చెబుతున్న ఆమె విజయం పైనే తీవ్ర చర్చ జరుగుతుంది.