ఆంధ్రప్రదేశ్ లో ప్రతిరోజు ఏదో ఓ వివాదాన్ని సృష్టించకుంటే రాజకీయనేతలకు రోజు గడిచేట్లు లేదు. తాజాగా అమరావతి కోసం ఎంఎల్ఏల రాజీనామా అంశం పెద్ద వివాదాన్నే రేపుతోంది. రాయపూడి గ్రామంలో గురువారం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ రెఫరెండమని, ఎల్ఎల్ఏల రాజీనామాలంటూ డిమాండ్ చేశారు. దానికి మంత్రి కొడాలినాని చాలా ఘాటుగా రిప్లై కూడా ఇచ్చేశారు. దాంతో గొడవ ముగిసిందనే అనుకున్నారు.
అయితే శుక్రవారం ఉదయం నుండి ఎంఎల్ఏల రాజీనామా అంశం మళ్ళీ మొదలైంది. విజయవాడ తూర్పు టీడీపీ ఎంఎల్ఏ గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ వైసీపీ ఎంఎల్ఏలను చాలెంజ్ చేశారు. మూడు రాజధానుల అంశంపై వైసీపీ ఎంఎల్ఏలు రాజీనామాలు చేస్తే అమరావతి అంశంపై తాము 23 మంది ఎంఎల్ఏలం రాజీనామా చేస్తామంటూ సవాలు విసిరారు. సరే దానికి గుంటూరు వైసీపీ ఎంఎల్ఏ ముస్తాఫా స్పందించారు కానీ నిజానికి గద్దె విసిరిన సవాలే అసంబద్ధమైనది.
టీడీపీ వాళ్ళు 23 మంది రాజీనామా చేస్తే వైసీపీ వాళ్ళు 151 మంది ఎంఎల్ఏలు రాజీనామాలు చేయాలట. నిజంగా బుర్రున్న వాళ్ళెవరు ఇటువంటి చాలెంజులు చేయరు, ఎవరైనా చేసినా ఎవరు యాక్సెప్ట్ చేయరు. చంద్రబాబునాయుడు కానీ లేకపోతే టీడీపీ ఎంఎల్ఏలు, నేతలు ఎంతసేపు జగన్ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పడిపోతుందా ? తామెప్పుడు అధికారంలోకి వచ్చేస్తామా అనే ఆలోచనే కనబడుతోంది.
ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి ఐదేళ్ళ కాలపరమితి ఉంటుందన్న ఇంగితం కూడా టీడీపీ నేలతకు లేకుండాపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడైనా సరే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు నచ్చకపోతే నచ్చనివాళ్ళు రాజీనామాలు చేస్తారంతే. అంతేకానీ నిర్ణయం తీసుకున్న అధికారపార్టీ వాళ్ళనే రాజీనామాలు చేయమనే డిమాండ్ ఒక్క ఏపీలో మాత్రమే కనబడుతోంది.
అధికారపార్టీ ఎంఎల్ఏలను రాజీనామాలు చేయమని పదే పదే డిమాండ్ చేయమనేబదులు అదేదో తమ 23 మంది ఎంఎల్ఏలతోనే చంద్రబాబు రాజీనామాలు చేయించచ్చు కదా ? ఎలాగూ టీడీపీ తరపున గెలిచిన 23 మందీ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రా, రాయలసీమ ప్రాంతాల నుండే గెలిచారు. కాబట్టి రాజీనామాలు చేసి మళ్ళీ అందరు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదనను జనాలు అంగీకరించటం లేదని తేలిపోతుంది.