హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. అధికార టీఆర్ఎస్ చిత్తయ్యింది. ఇక మధ్యలో ఓట్ల చీల్చడానికంటూ ముందుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ తేలిపోయింది. కాంగ్రెస్ కు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. ఏ రౌండ్ లోనూ కనీసం స్వతంత్ర్య అభ్యర్థి రోటీమేకర్ అంత కూడా ఓట్లు సంపాదించలేదు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ దారుణ ఓటమిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించాడు.
హుజూరాబాద్ లో ఓటమికి తనదే బాధ్యత అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఒక ఉప ఎన్నికతో పార్టీని నిర్ధేశించలేదన్నారు. ఆలస్యంగా అభ్యర్థిని నిలబెట్టినా ఊరుఊరు వెంకట్ తిరిగాడన్నారు. భవిష్యత్ లో పార్టీకి బలమైన నాయకుడు అవుతారన్నారు. రేపటి నుంచే ఈ నియోజకవర్గంలో ఉంటారని తెలిపారు.
ఇక పార్టీ కోసం కష్టపడి పనిచేసే ఓపిక, సహనం నాకు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. క్యాడర్ ఆత్మస్థైర్యంతో ఉండాలన్నారు. యుద్ధం జరిగినప్పుడు గెలిచిన రాజు రాజ్యం పాలిస్తారన్నారు. ఓడిపోయినవాళ్లు బానిసలు అవుతారని కానీ ఇది రాజరికం కాదని.. ఓటమి గెలుపునకు దారులు వేస్తుందన్నారు.
కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు అండగా ఉంటానని.. ఈ ఓటమి నాలో మరింత కసి పెంచుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. గులాబీ చీడ వదులుతుందని రేపటి నుంచే జనంలోకి వెళ్తాం అన్నారు. ఎన్నికలు ప్రత్యేక సందర్భంలో జరిగాయని.. భవిష్యత్తులో అన్ని వివరాలు అంశాలను వివరంగా వివరిస్తామన్నారు. నిరాశ నుంచే పార్టీ నిర్మాణం చేపట్టవచ్చు అని రేవంత్ రెడ్డి అన్నారు.