ఎన్నికలకు మరో రెండేళ్లకు పైనే సమయం ఉన్న వేళలో.. రాజకీయం ఇంతలా వేడెక్కిపోవటం చాలా అరుదు. గతానికి భిన్నంగా ఈసారి విచిత్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయ వాతావరణం హాట్ హాట్ గా మారిపోవటం తెలిసిందే. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో ఆరేడు నెలల ఆలస్యంగా ఎన్నికలు జరిగే పరిస్థితి. గడువు కంటే ముందుగా 2018లో కేసీఆర్ ఎన్నికలకు వెళ్లాలన్న అనూహ్య నిర్ణయంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. గడిచిన కొద్ది నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం మరో రూపంలోకి వెళుతోంది.
మొన్నటివరకు తెలంగాణ అధికారపక్షానికి తిరుగులేదన్న వాతావరణం ఉండేది. అందుకు భిన్నమైన పరిస్థితులు ఇప్పుడు నెలకొంటున్నాయి. కేసీఆర్ సర్కారు మీద పెరుగుతున్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవటానికి రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.ఇందులో భాగంగా బీజేపీ మహా దూకుడుగా వెళుతుంటే.. నాయకత్వ లేమితో తెలంగాణ కాంగ్రెస్ డీలా పడింది. ఎప్పుడైతే రేవంత్ కు పార్టీ పగ్గాలు అప్పజెప్పారో అప్పటి నుంచి పరిస్థితుల్లో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి. వరుస పెట్టి సభలు.. సమావేశాల్ని నిర్వహించటం.. పార్టీ క్యాడర్ లో జోష్ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
దీనికి తోడు పదునైన విమర్శలు.. ఆరోపణలతో తెలంగాణ అధికారపక్షానికి షాకుల మీద షాకులు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఖాయమని.. దాన్ని ఎవరూ అడ్డుకోలేరని చెబుతుంటారు రేవంత్ రెడ్డి. తాజాగా ఆయన ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే 72 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుందని చెప్పటం గమనార్హం. మొత్తం 119 నియోజకవర్గాల్లో తమ బలం ఏమిటన్న విషయంపై రేవంత్ అతిశయపు మాటలు చెప్పకుండా.. ఆచితూచి అన్నట్లు లెక్కలు చెప్పినట్లుగా చెప్పాలి.
మిగిలిన అధినేతల మాదిరి క్లీన్ స్వీప్ చేస్తామని.. అద్భుత విజయం సాధిస్తామన్న మాటకు భిన్నంగా.. విన్నంతనే కాస్త ఆసక్తిని ప్రదర్శించేలా రేవంత్ లెక్కలు ఉన్నాయని చెప్పాలి. వచ్చే నెల 10న పార్టీ ముఖ్యనేత రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారని చెప్పారు.రాహుల్ కార్యక్రమం సెప్టెంబరు 10 నుంచి 17 మధ్యలో ఉంటుందన్న మాట వినిపిస్తోంది. మరో వైపు హుజూరాబాద్ లో నిర్వహించతలపెట్టిన దండోరా సభ కంటే ముందు జిల్లాల్లో రాష్ట్ర నేతలతో సమన్వయం అవసరమన్న అభిప్రాయం పలువురునేతల్లో వ్యక్తమవుతోంది. అంతేకాదు.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఎవరన్న విషయాన్నిముందుగ ప్రకటిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయన్న విషయంలో రేవంత్ అతిశయానికి పోకకుండా ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లుగా చెప్పక తప్పదు.