సెప్టెంబరు 17 విమోచన దినాన్ని చేయాలని, అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహించాలనే డిమాండ్‌తో అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు వ్యతిరేకంగా.. రెండు తెలంగాణ విపక్షాలు.. బీజేపీ, కాంగ్రెస్‌లు.. పోటా పోటీ మీటింగులు పెట్టాయి. బీజేపీ పెట్టిన సమావేశానికి కేంద్ర హోం మంత్రి, పార్టీలో నెంబర్ 2గా ఉన్న అమత్ షా హాజరయ్యారు. ఇక, కాంగ్రెస్ పెట్టిన సమావేశాలకు ఎవరో ఒకరు సీనియర్‌నేత రావాలిగా.. అందుకే కర్ణాటకకు చెందిన మల్లికార్జున ఖర్గేను ఆహ్వానించారు. ఆయన వచ్చారు. కానీ, ఆయన పెద్దగా తెలంగాణ ప్రజలకు తెలియదు. కానీ, ఆయన సీనియర్ పార్లమెంటేరియన్.
అయితే, రేవంత్ మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీర్ నియోజకవర్గం గజ్వేల్‌లో ఈ మీటింగ్ పెట్టారు. బీజేపీ మాత్రం ఎక్కడో నిర్మల్‌లో సభ పెట్టింది. ఇక, మొత్తం ప్రజలు మీడియా.. సోషల్ మీడియాలో అందరూ ఈ మీటింగులను కన్నార్పకుండా చూశారు. ఈ క్రమంలో రేవంత్ తన ఛాలెంజ్ నెగ్గించుకున్నారు. ముఖ్యంగా బీజేపీపై ఆయన విజయం సాధించారని.. నెటిజన్లు చెబుతున్నారు. ఎలాగంటే.. రేవంత్ మీటింగ్ కు రాష్ట్రం నలుమూలల నుంచి ఒక లక్ష మంది వస్తారని అంచనా వేస్తే.. దాదాపు 3-4 లక్షల మంది వచ్చారని చెబుతున్నారు. అయితే.. రేవంత్‌రెడ్డి మాత్రం సభా ముఖంగానే తన సభకు రెండు లక్షల మంది వచ్చినట్టు చెప్పారు.
ఇక, ఈ విషయంలో రేవంత్ నేరుగా బీజేపీ హైకమాండ్‌కే ఛాలెంట్ వేశారని ప్రచారం జరుగుతోంది. రేవంత్ రాక ముందు.. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా అయిన పరిస్థితి. బీజేపీ నెంబర్ 2 ప్లేస్ లోకి వచ్చింది. అయితే.. రేవంత్ రెడ్డి వచ్చాక.. నేరుగా పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి లక్షల మందిని రప్పిస్తున్నారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నన్నప్పటికీ.. దీనికి ప్రజల నుంచి పెద్దగా స్పందన రావడం లేదు. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ ఎస్‌కు పోటీ మళ్లీ కాంగ్రెస్ అనేది ప్రజలకు అర్ధమైందని అంటున్నారు పరిశీలకులు.
రేవంత్ దెబ్బకు తెలంగాణలో బీజేపీ వెనుకకు వెళ్లింది. రేవంత్‌రెడ్డి అధికార పార్టీ టీఆర్ ఎస్ మీద ఢీ అంటే ఢీ అనే పరిస్థితి వచ్చింది. సాక్షత్తూ.. టీఆర్ ఎస్ మంత్రులను కూడా ఆయన లక్ష్యంగా చేసుకుని కామెంట్లు కుమ్మరిస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ విజయంసాధించారనేది విశ్లేషకుల మాట. ఈ క్రమంలోనే బీజేపీలో ఒక టాక్ నడుస్తోందని చెబుతున్నారు. రేవంత్ దెబ్బకు మనం పుంజుకోవడం కష్టమేనని.. పార్టీ హైకమాండ్ కూడా భావిస్తున్నట్టు సమాచారం. రేవంత్‌ను నిలువరించాలంటే.. ఏం చేయాలనే విషయంపై బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ విషయంలో కేసీఆర్ కూడా బీజేపీతో చర్చించినట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీపర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్.. రేవంత్‌దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు.. ఓటు కు నోటు కేసును తిరిగదోడాలని.. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న రేవంత్‌కు ఆ బెయిల్ రద్దయ్యేలా చేసి.. పక్కన పెట్టించాలనే ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఈ ఆర్టికలపై మీ దగ్గర ఇంకా సమాచారం ఉంటే.. కామెంట్ రూపంలో పంపండి. నిజమైన సమాచారం అయితే.. ఈ ఆర్టికల్‌ను ప్రచారం చేస్తామని తుపాకీ తన పాఠకులకు హామీ ఇస్తోంది.