తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై తీవ్రంగా విరుచుకుపడే టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్ రెడ్డి తాజాగా కొత్త ఆరోపణ చేశారు. ఫీజు పోరు పేరుతో రాష్ట్రవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన రేవంత్..వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ నుంచి దీనికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన కొత్త విమర్శలు చేశారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలోకి రాకముందు తనకు తెలిసినంత వరకు ఆయనకు బంజారా హిల్స్ లో ఒక ఇల్లు ఉండేదని అదికూడా తాకట్టులో ఉండేదని రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే, తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాక ఆయనకు మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ వచ్చిందని, తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీ న్యూస్ ఛానల్, నమస్తే తెలంగాణ పేపర్లు వచ్చాయని ఆరోపించారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ చేతికి రూ.5000 కోట్ల కంపెనీలు వచ్చాయని తెలిపారు. ఈ ఆస్తులన్ని ఎలా కూడబెట్టారని ఎన్ని సార్లు ప్రశ్నించినా కేసీఆర్ నుంచి సమాధానం రాలేదని అన్నారు. ప్రపంచ చరిత్రలో ఉద్యమ కారులుగా ప్రసిద్ధి చెందిన వారెవ్వరూ ఈ విధంగా ఆస్తులను కూడబెట్టలేదని రేవంత్ వ్యాఖ్యనించారు.
కేసీఆర్‌ను ఉద్యమకారుడంటే తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను అర్పించిన శ్రీకాంతాచారి, నిషాన్ రెడ్డి, కానిస్టేబుల్ కిష్టయ్య, యాదయ్యలంటి వారిని ఏమని పిలవాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ కోసం తన ప్రాణాలను ఆర్పించిన కానిస్టేబుల్ కిష్టయ్య పేరిట ఒక భవనాన్ని నిర్మిస్తామని శంకుస్థాపన చేశారని అయితే ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలను చేపట్టలేదని వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బిడ్డ మాత్రమే ఉండాలని కోరుకుంటూ తెలంగాణ తొలి, మలి ఉద్యమాలలో 1569 మంది తమ ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు. అయితే, ఆ అమరవీరులందరినీ అవమానించే రీతిలో సీఎం కేసీఆర్ తన ముఖ్యమంత్రి పీఠంపై ఆంధ్ర ప్రాంతానికి చెందిన చిన్నజీయర్ స్వామిని కూర్చోబెట్టడం ద్వారా ఆ అమరుల ఆత్మలు క్షోభించేలా చేశారని ఆరోపించారు. కేసీఆర్‌కు కడుపుకోత బాధ, కన్న తల్లుల క్షోభ గురించి ఏమాత్రం తెలియదని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ చేసిన ఈ దుర్మార్గమైన చర్యపై రాష్ట్రానికి చెందిన మీడియా ఎలాంటి వార్తలు ప్రసారం చేయకుండా మౌనం వహించినా విదేశీ ఛానళ్లు మాత్రం ఈ ఉదంతాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రసారం చేశాయని రేవంత్ వెల్లడించారు.
విద్యార్థి పోరుపేరిట విద్యార్థుల సమస్యలపై ఉద్యమించిన తనను అడ్డుకోవడానికి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రయత్నిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అదే విధంగా ప్రభుత్వం కూడా ఈ కార్యక్రమానికి ఆటంకాలు కలిగించాలని ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం అడ్డంగా పడుకున్నా తాను రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలకు తిరుగుతానని, విద్యార్థులను సమన్వయం చేసి పోరు సాగిస్తానని స్పష్టం చేశారు. తాను మిషన్ కాకతీయలో కమీషన్లు అడగడం లేదని, బతుకమ్మ పేరిట కేటాయించిన బడ్జెట్లో భాగం అడగడం లేదని కేవలం ఇచ్చిన హామీలను నిలబెట్టుకొమ్మని కేసీఆర్ను అడుగుతున్నానని పేర్కొన్నారు. లక్షా 7 వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన కేసీఆర్ అధికారంలోకి వచ్చి 30 నెలలు అయినా ఉద్యోగ నియామకాలను చేపట్టడం లేదని విమర్శించారు. కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందిస్తామని ప్రకటించిన కేసీఆర్ దీనికి భిన్నంగా రాష్ట్రంలో 3224 పాఠశాలలను మూసివేయడానికి రంగం సిద్ధం చేస్తోందని, బకాయిలను చెల్లించని కారణంగా గడిచిన రెండేళ్ల కాలంలో 270 ఇంజనీరింగ్, ఫార్మ కళాశాలలు మూతపడ్డాయని రేవంత్ ధ్వజమెత్తారు. ఒకప్పుడు చదువులకు ప్రసిద్ధి చెందిన ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలలో ప్రస్తుతం బోధించడానికి ప్రొఫెసర్లు కూడా లేరని, కాకతీయలో 54 మంది ప్రొఫెసర్లకు గాను కేవలం ఒక్క ప్రొఫెసర్ మాత్రమే ఉండగా ఉస్మానియా యూనివర్సిటీలో 154 మంది ప్రొఫెసర్లకుగాను కేవలం ఇద్దరు మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. ఈ విధమైన పరిస్థితులలో చదువులు ఎలా కొనసాగుతాయని నిలదీశారు. ఫీజు రీయింబర్స్ మెంట్లకోసం కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడే పరిస్థితి లేదని కాలర్ పట్టుకొని, జట్టుపీకి ఒంగబెట్టి వీపుపై గుద్ది రీయింబర్స్మెంట్ బకాయిలను రాబడతామని రేవంత్ హెచ్చరించారు.