అమెరికాలో బాత్రూం క‌డిగిన‌ కేటీఆర్‌:రేవంత్‌

Update: 2018-02-07 16:18 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ పై ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను త‌న జీవితకాల ప్ర‌త్య‌ర్థిగా భావించి విమ‌ర్శ‌లు చేసే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అదే స‌మ‌యంలోనే ఇటీవ‌ల‌ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి మ‌రోమారు అలాంటి రెచ్చ‌గొట్టే కామెంట్లు చేశారు. గాంధీ భ‌వన్‌ లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు. మంత్రి కేటీఆర్ త‌న స్థాయిని మించి మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. `కేటీఆర్‌ కు తెలంగాణలో చప్రాసీ నౌకరు కూడా రాదు. అమెరికాలో కేటీఆర్ బాత్‌ రూములు క‌డిగేవారు ఎవ‌ర‌ని గూగుల్‌ ను అడిగితే కేటీఆర్ పేరు చెప్తుంది`అని వివాదాస్ప‌ద‌ ఆరోప‌ణ‌లు చేశారు. `పద్మాలయా స్టూడియోలో - ఒడిశాలో సెటిల్‌ మెంట్ కేసులలో ఉన్న కేటీఆర్...కాంగ్రెస్ ను విమర్శిస్తారా?` అని రేవంత్ వ్యాఖ్యానించారు.

కాగా, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై రేవంత్ విరుచుకుప‌డ్డారు. `పార్ల‌మెంటులో మోడీ ప్రసంగం చౌక బారు స్పీచ్ ను తలపించింది. తెలంగాణ సమాజాన్ని మోడీ అవమానించారు. తెలంగాణ బిల్లును మోడీ వెటకారంగా మాట్లాడటం దారుణం. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్. తెలంగాణ ఆకాంక్షలను నెరవేర్చేందుకే నాడు యూపీఏ స‌ర్కారు తెలంగాణ బిల్లును తెచ్చింది. తెలంగాణ ను మోడీ అవమానించారు ..దీనికి బీజేపీ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ డోర్లు మూసి రాష్ట్రం ఇచ్చింద‌న్న ప్ర‌ధాని మోడీ...ఏదైన బిల్లుపై ఓటింగ్ ఉంటే చట్టసభల త‌లుపులు మూస్తారన్న సంగతి ప్ర‌ధానికి తెలియదా?` అని ప్ర‌శ్నించారు.

మోడీ - కేసీఆర్ లు బడా చోర్-చోటా చోర్ అని రేవంత్ విరుచుకుప‌డ్డారు. నీలం సంజీవరెడ్డి - అంజయ్య - పీవీ న‌ర్సింహారావును రాష్ట్రపతి - సీఎం - పీఎం చేసింది కాంగ్రెస్ పార్టీయేన‌ని మోడీ మరిచిపోయారని అన్నారు. `తిరుపతిలో ఏపీ హోదాపై ఇచ్చిన మాటను మోడీ మరిచి మోసం చేశారు. వెంకన్నకు మోడీ శఠగోపం పెట్టారు. తెలంగాణ విభజన చట్టంలో ఏ ఒక్క హామీ ఎందుకు అమలు చేయలేదు? ఎన్డీయే విభజించి మూడు రాష్ట్రాలలో సమస్యలు యూపీఏ పరిష్కరించింది. కానీ మోడీ ప్రభుత్వం అది మర్చిపోయింది. సమస్యపై పరిష్కారానికి మోడీ ఒక్కసారైన తెలుగు సీఎంలతో మాట్లాడారా? మోడీ ప్ర‌ధాని అయ్యాక తెలంగాణకు చేసింది ఏమిటి?` ని సూటిగా నిల‌దీశారు. `అద్వానీ - వాజ్ పాయీ లాంటి నేతలను అణిచివేస్తూ..అవమానిస్తున్నది మోడీ. బీజేపీ మంత్రులు, ఎంపీలను మోడీ కట్టు బానిసలుగా చూస్తున్నారు. రాజస్థాన్ ఫలితాలతో మోడీ ఆందోళననే పీఎం స్పీచ్ లో కనబడింది` అని రేవంత్ ఆరోపించారు.
Tags:    

Similar News