ఆస్తుల లెక్క‌పై రేవంత్ క్లారిటీ..కేసీఆర్ కు స‌వాల్‌!

Update: 2018-09-30 04:49 GMT
తెలంగాణ ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు తెలంగాణ కాంగ్రెస్ నేత‌.. టీపీసీసీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి భారీ స‌వాల్ విసిరారు. త‌న ఆస్తుల‌పై సుదీర్ఘంగా సాగిన ఐటీ అధికారుల త‌నిఖీల నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడారు. త‌న ఆస్తుల‌కు సంబంధించి చేస్తున్న ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌వాలేన‌ని చెప్పిన రేవంత్‌.. త‌న ఆస్తుల‌తో పాటు కేసీఆర్ ఆస్తుల‌పైనా సిట్టింగ్ జ‌డ్జితో విచార‌ణ‌కు సిద్ధ‌మా? అని ప్ర‌శ్నించారు.

జీఎస్టీ.. పెద్ద‌నోట్ల ర‌ద్దు.. రాఫెల్‌.. కేసీఆర్ అవినీతిపై ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తాన‌న్న ఉద్దేశంతోనే కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో త‌న‌పై దాడులకు పాల్ప‌డుతున్న‌వ్యాఖ్యానించారు.

త‌న ఆస్తుల‌పై ఆరోప‌ణ‌లు చేస్తున్న వేళ‌.. రేవంత్ ఎదురుదాడికి దిగారు. ఉద్య‌మ స‌మ‌యంలో కేసీఆర్.. ఆయ‌న కుటుంబ స‌భ్యుల ఆస్తులు ఎంత‌?  ఇప్పుడున్న‌వి ఎంత‌న్న‌ది చూడాల‌న్న రేవంత్‌.. తెలంగాణ‌కు ప‌ట్టిన కేసీఆర్ పీడ‌ను వ‌దిలించుకోవ‌టానికి తాను ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు.

కేసీఆర్ కుటుంబ స‌భ్యుల అవినీతి.. అక్ర‌మాల‌పై హైకోర్టులో ఐదు ప్ర‌జా ప్ర‌యోజ‌న వ్యాజ్యాలు వేసిన‌ట్లు చెప్పిన రేవంత్‌.. త‌న‌కు ప్రాణాపాయం ఉంద‌ని కేంద్ర బ‌ల‌గాల‌తో త‌న‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని హైకోర్టు సూచ‌న చేసినా.. ప్ర‌భుత్వం అవ‌స‌రం లేద‌ని కొట్టి పారేసిన వైనాన్ని రేవంత్ గుర్తు చేశారు.మ‌రి.. రేవంత్ స‌వాలు విసిరిన‌ట్లుగా కేసీఆర్ త‌న ఆస్తుల‌పై సిట్టింగ్ జ‌డ్జి విచార‌ణ‌కు సిద్ద‌మా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. రేవంత్ స‌వాలుపై కేసీఆర్ అయితే స్పందించే ప్ర‌స‌క్తే ఉండ‌దు.. మ‌రి.. టీఆర్ఎస్ నేత‌లు ఏ రీతిలో రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News