కేటీఆర్.. కవితలకు రేవంత్ ఛాలెంజ్

Update: 2016-01-07 04:47 GMT
గ్రేటర్ నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య రాజకీయ వ్యాఖ్యలు జోరు పెరిగింది. ఇప్పటికే కమలదళంపై గులాబీ దండు ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు.. తెలుగుదేశం పార్టీపైనా తెలంగాణ అధికారపక్షం విమర్శలు చేస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తాజాగా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు.. మంత్రి కేటీఆర్.. కుమార్తె కమ్ ఎంపీ కవితపై హోల్ సేల్ గా విమర్శలు చేశారు. సవాళ్లు విసిరారు. త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల్లో తాను చెప్పిన చోట కార్పొరేటర్లుగా నిలబడి గెలుస్తారా? అంటూ రేవంత్ సవాలు విసరటం గమనార్హం.

తాజాగా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గపరిధిలోని ఏ డివిజన్ నుంచైనా సరే.. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ .. కేసీఆర్ కుమార్తె కవిత.. నియోజకవర్గంలోని ఏ డివిజన్ నుంచైనా సరే.. కార్పొరేటర్ గా నిలబడి గెలిస్తే.. తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు.

శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని డివిజన్ నుంచి  కేటీఆర్.. కవితలు గెలిస్తే..తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఛాలెంజ్ విసరటం విశేషం. తెలంగాణలో టీటీడీపీ ఎక్కడ ఉందని ప్రశ్నించే అబ్బా.. తనయుడు ఇద్దరూ ఒక్కసారి శేరిలింగంపల్లి నియోజకవర్గానికి వస్తే తెలుగుదేశం పార్టీ సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. కొడుకు.. మేనల్లుడుకి మంత్రి పదవులు.. కూతురికి ఎంపీ పదవి కట్టబెట్టిన కేసీఆర్.. ఒక్క మహిళకు తన మంత్రిమండలిలో అవకాశం ఇవ్వకపోవటం దారుణమని వ్యాఖ్యానించారు. మిగిలిన విమర్శల సంగతి ఎలా ఉన్నా.. రేవంత్ రాజకీయ సన్యాసం చాలెంజ్ పై కేటీఆర్.. కవితలు ఎలా స్పందిస్తారో..?
Tags:    

Similar News