ఇద్దరూ ఇద్దరే...తమలపాకుతో నువ్వొకటంటే...తలుపు చెక్కతో నేను రెండంటా అనేది ఇద్దరి శైలి. తెలంగాణ రాజకీయాల్లో డైనమిక్ లీడర్ ఒకరయితే...ఫైర్ బ్రాండ్ పొలిటీషియన్ మరొకరు. ఆయనే తెలంగాణ మంత్రి కేటీఆర్ - టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మాటల తూటాలు పేల్చడంలో ఇద్దరు నేతలు ఉద్దండులే. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తమ పార్టీని త్వరలో తెలంగాణ రాష్ర్ట సమితి బదులుగా తెలుగు రాష్ర్ట సమితిగా పేరు మారుస్తామని ప్రకటించారు. అంతేకాదు తాను ఏపీలో ఎన్నికల బరిలోకి దిగితే భీమవరం నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.
దీనిపై తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తున్న తెలుగు రాష్ర్టాల అభివృద్ధి భావన ఇప్పటికైనా టీఆర్ ఎస్ కు అర్థమైనందుకు సంతోషమన్నారు. అయితే ఇపుడు టీఆర్ ఎస్ చెప్తున్న మాటలన్నీ ఓట్లకోసమేనని రేవంత్ వ్యాఖ్యానించారు. ఒకవేళ టీఆర్ ఎస్ కు చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ రాష్ర్ట కార్యాలయమైన తెలంగాణభవన్ పేరును తెలుగు భవన్ గా మార్చాలని డిమాండ్ చేశారు. అప్పుడే కేటీఆర్ మాటల్లో చిత్తశుద్ధి ఉందని తేలుతుందని వ్యాఖ్యానించారు.
అంతేకాదు టీఆర్ ఎస్ కు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. తెలుగుభవన్ గా పేరు మార్చుకోవడంలో ఏమైనా ఇబ్బందులు మొహమాటాలు ఉంటే...తామే ఉచితంగా బోర్డు తయారు చేసి పంపిస్తామని..జస్ట్ అంటించుకుంటే చాలని వ్యాఖ్యానించారు. రేవంత్ ఓపెన్ సవాల్ కు, సిల్లీ ఆఫర్ కు కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.