తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి రోజుకో రకంగా చెలరేగిపోతున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఎవరూ స్పృశించని కోణాల్లో విమర్శలు చేయటం రేవంత్ కు మాత్రమే చెల్లుతుంది. కేటీఆర్.. హరీశ్ రావుల మధ్య పంచాయితీ ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. హరీశ్ ను హైదరాబాద్ నుంచి బహిష్కరించారంటూ విరుచుకుపడిన ఆయన.. తాజాగా తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
గురువారం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ ఫ్యామిలీలో లుకలుకలు ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. అలా ఎలా చెబుతారంటే.. గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి కేటీఆర్..కవిత.. కేసీఆర్ చెబుతున్న మాటల్లో పొంతన లేకపోవటమే దీనికి నిదర్శనంగా చెప్పుకురావటం గమనార్హం.
అంతేకాదు.. గ్రేటర్ లో మజ్లిస్ తో సంబంధం లేకుండా సీట్లు సాధిస్తామని కేటీఆర్ చెబితే.. ఇప్పుడేమో ఆయన తండ్రి కేసీఆర్ మజ్లిస్ తమ మిత్రపక్షం అని చెబుతున్నారంటూ తాను చేస్తున్న ఆరోపణల్ని వివరించే ప్రయత్నం చేశారు. కొన్ని అంశాల మీద కేసీఆర్ ఫ్యామిలీ సభ్యులు వేర్వేరుగా స్పందిస్తేనే గొడవ ఉన్నట్లా అని రేవంత్ వ్యాఖ్యలు విన్న గులాబీ దళం మండిపడుతోంది.