'చచ్చిన బర్రె పగిలిన కుండ నిండా పాలిచ్చిందన్నట్లు' ఉందట!

Update: 2022-09-10 07:32 GMT
తెలంగాణ కాంగ్రెస్ రథసారధి రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది. తనపై ట్వీట్ కత్తి దూసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇరు నేతల మధ్య మొదలైన ట్వీట్ వార్ ఒకరికి ఒకరు ధీటుగా రియాక్టు అయ్యారు.

ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితకు సంబంధం ఉన్నట్లుగా ఆరోపణలు రావటం.. తన ఇమేజ్ కు భంగం కలిగేలా ఆరోపణలు చేయొద్దంటూ కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇదే అంశాన్ని ప్రస్తావించిన బీజేపీ నేత రాజగోపాల్ రెడ్డి కవితతోపాటు రేవంత్ పైనా విరుచుకుపడ్డారు.

'ఢిల్లీలో తీగ లాగితే ప్రగతిభవన్.. గాంధీభవన్ వ్యాపార సంబంధాల డొంక కదిలింది' అంటూ రాజగోపాల్ రెడ్డి ట్వీట్ సంచలనంగా మారింది. దీనికి బదులుగా రేవంత్ మరింత ఘాటుగా రియాక్టు అయ్యారు.

ఇలాంటి చిల్లర కథనలు మనుగోడులో కాపాడలేవన్న రేవంత్.. తన మీద వచ్చిన ఆరోపణలకు వివరణ ఇస్తూనే.. మండిపడ్డారు. తాను ఎలాంటి వ్యాపారం చేయలేదన్న ఆయన.. కంపెనీ పెట్టిన మాట నిజమేనన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

''2010 ఫిబ్రవరి 2న అడికోర్ ఇన్ ఫ్ట్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్ గా చేరి.. 13 రోజుల్లోనే రాజీనామా చేశాను. ఫిబ్రవరి 15న రాజీనామా ఉంది. ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే 2013లో ఆ కంపెనీ క్లోజ్ అయ్యింది' అని పేర్కొన్నారు.

తన మాటలకు సాక్ష్యంగా కొన్ని పత్రాల్ని ట్వీట్ కు జత చేశారు. చివర్లో తనదైన ట్వీట్ పంచ్ చేస్తూ.. రాజగోపాల్ వైఖరిని తప్పుపట్టారు. 'చచ్చిన బర్రె పగలిన కుండ నిండా పాలు ఇచ్చినట్లుగా రాజగ్ పాల్ వ్యవహారం ఉంది' అంటూ ఫైర్ అయ్యారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News