పీసీసీ చీఫ్ గా గద్దెనెక్కినప్పటి నుంచి పార్టీ బలోపేతం కోసం ఏమాత్రం మొహమాటలు పెట్టుకోకుండా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి. తనను తీవ్రంగా వ్యతిరేకించిన వీ హనుమంతరావును ఆస్పత్రికి వెళ్లి మరీ పలకరించారు. అంతేకాదు.. కాంగ్రెస్ సీనియర్లు అయిన భట్టి, శ్రీధర్ బాబు, మర్రి శశిధర్ లను వారి ఇంటికెళ్లి కలిసి మరీ కాకరేపారు. సొంత పార్టీలో అసంతీప్తిని చల్లార్చిన రేవంత్ రెడ్డి ఇప్పుడు బీజేపీ పై పడ్డారట..
బీజేపీలో చేరిన పాత టీడీపీ నేతలకు రేవంత్ రెడ్డి గాలం వేస్తున్నారు. ఏమాత్రం మొహమాట పడకుండా వారిని కలుస్తూ తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానిస్తున్నాడట.. బీజేపీలోని అసంతృప్త నేతలందరికీ
ఇప్పుడు తనతోపాటు కాంగ్రెస్ లోకి తీసుకురావాలని యోచిస్తున్నారట..
తెలంగాణలో రేవంత్ రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు నిజంగా బీజేపీకి చమటలు పట్టిస్తున్నాయట.. బీజేపీ నేతల్లో బీపీ పెంచేలా రేవంత్ రెడ్డి అందరినీ కలుస్తుండడంతో కలవరపడుతున్నారట..
బీజేపీ నేతల దూకుడును మించి వెనుకాల నుంచి నరుక్కువస్తున్న రేవంత్ రెడ్డి తీరుతో బీజేపీ నేతలు ఇప్పుడు నేతలను కాపాడుకునే పనిలో పడుతున్నారట..
రేవంత్ రెడ్డి వరుస పర్యటనలు, కలుస్తున్న నేతలు అంతా సై అనడంతో బీజేపీ ఖాళీ అవుతూ కాంగ్రెస్ బలోపేతమవుతోంది. ఇప్పటికే బీజేపీ నేతలతో రేవంత్ టచ్ లో ఉన్నాడు. పలువురు ముఖ్య నేతలు వస్తామంటున్నారు.
బీజేపీలోని టీడీపీ మాజీ నేతలు పెద్దిరెడ్డి, చాడ సురేష్ రెడ్డి, బోడ జనార్ధన్, విక్రమ్ గౌడ్ లతో రేవంత్ రెడ్డి టచ్ లోకి వెళ్లి వారిని కాంగ్రెస్ లో చేరేలా ఒప్పించినట్టు సమాచారం. ఈ నేతలందరూ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే బీజేపీకి రేవంత్ వల్ల భారీ దెబ్బ పడడం ఖాయంగా కనిపిస్తోంది.