తెలంగాణ తెలుగు దేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ప్రమాదం అంచున ఉన్నారా... ఆయన ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉందా? అంటే పరిస్థితులు, ఆయనలోని ఆందోళన అవుననే చెబుతున్నాయి. తనకు తరచూ బెదిరింపు కాల్సు వస్తున్నాయని రేవంత్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉమ్మడి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. తనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి భద్రత కల్పించాలని ఆయన తన పిటిషన్ లో కోరారు. ఆ పిటిషన్ లో రేవంత్ రెడ్డి పలు సంచలన విషయాలను ప్రస్తావించారు.
గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తనకు తరచూ బెదిరింపు ఫోన్ కాల్సు వస్తున్నాయని.. తన ప్రాణాలకు ముప్పు ఉందని రేవంత్ ఆందోళన వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వంపై గాని, తెలంగాణ పోలీసు శాఖపై గాని తనకు నమ్మకం లేదని చెప్పారు. తనకు కేంద్ర ప్రభుత్వం నుంచి భద్రత కల్పించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి పిటిషన్ పై కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆ నోటీసుల్లో కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అయితే.. రేవంత్ తనను ఎవరు బెదిరిస్తున్నారన్న విషయంపై స్పష్టత ఇవ్వలేదు. బెదిరింపు కాల్సు వస్తున్నాయని చెప్పడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతపై సందేహాలు వ్యక్తంచేయడంతో ఆయన ప్రభుత్వంపైనే ఆరోపణలు చేస్తున్నట్లు అర్థమవుతోంది. అయితే... రేవంత్ కు నిజంగానే ప్రాణహాని ఉందా.. లేదంటే ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు రేవంత్ ఈ మార్గం ఎంచుకున్నారా అన్న చర్చ సాగుతోంది.