తెలంగాణలో రాజకీయ వేడి మళ్లీ రాజుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో సీఎం కేసీఆర్ పై రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. కేసీఆర్ పుట్టినరోజు జరుపుకోవడానికి తనను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం లంగర్ హౌస్ పోలీస్ స్టేన్ కు తరలించారు.
అటు గాంధీభవన్ వద్ద కూడా పోలీసులను భారీగా మోహరించారు. కాంగ్రెస్ శ్రేణులు ఎటువంటి ర్యాలీలు చేపట్టకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. రేవంత్ రెడ్డి అరెస్ట్ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
పోలీసుల జులూం నశించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశఆరు. దీనికి సంబంధించిన వీడియోను రేవంత్ రెడ్డి ట్విట్టర్ లో షేర్ చేశారు. అదే ట్వీట్ లో సీఎం కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు. ‘కేసీఆర్ తన నీడకు కూడా భయపడుతాడు. కేసీఆర్ తన పుట్టినరోజు జరుపుకునేందుకు వీలుగా వరుసగా రెండో రోజు కూడా నన్ను అరెస్ట్ చేశారు.
ఓవైపు నిరుద్యోగ యువత ప్రాణాలు తీసుకుంటుంటే.. పుట్టినరోజులు జరుపుకోవడానికి ఇదేనా సమయం.. కేసీఆర్ జన్మదినం.. ప్రతిపక్ష నేతల జైలుదినం కావాలా?’ అని రేవంత్ రెడ్డి నిలదీశారు. నిరుద్యోగుల తరుఫున ప్రశ్నించడమే మేం చేసిన నేరమా? అని కోరారు