గ‌రంగ‌రంగా మార్చిన త‌ల‌సాని వ్య‌వ‌హారం

Update: 2015-07-19 09:57 GMT
స‌మాచార హ‌క్కు చ‌ట్టం ప్ర‌కారం.. తెలంగాణ రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ రాజీనామా వ్య‌వ‌హారంలోని లోగుట్టును కాంగ్రెస్ సీనియ‌ర్‌నేత గండ్ర వెంక‌ట ర‌మ‌ణారెడ్డి బ‌య‌ట పెట్ట‌టం.. ఆయ‌న త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేయ‌లేద‌ని చెప్ప‌టం ఇప్పుడు రాజ‌కీయ సంచ‌ల‌నంగా మారింది.

గండ్ర వివ‌రాలు బ‌య‌ట పెట్ట‌టంతో తెలంగాణ విప‌క్షాలు తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నాయి. టీటీడీపీ నేత‌.. ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్సందించారు. త‌ల‌సాని వ్య‌వ‌హారంపై గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని.. త‌ల‌సాని రాజీనామా వ్య‌వ‌హారంలో గ‌వ‌ర్న‌ర్ పాత్ర‌ను కూడా అనుమానించాల్సి వ‌స్తోంద‌ని వ్యాఖ్యానించారు. త‌ల‌సాని వ్య‌వ‌హారంపై గ‌వ‌ర్న‌ర్ తీసుకునే చ‌ర్య‌ల ద్వారా.. ఆయ‌న నిజాయితీ ఏమిటో అర్థం అవుతుంద‌ని రేవంత్ విమ‌ర్శించారు.

త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ రాజీనామాలో త‌ప్పు అంతా స్పీక‌ర్ మ‌ధుసూద‌నాచారిదేన‌ని రేవంత్ దుయ్య‌బ‌ట్టారు. త‌న రాజీనామా విష‌యంలో అంద‌రిని మోసం చేసిన త‌ల‌సానిని రాజకీయాల నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. నిర్ణ‌యాల విష‌యంలో నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన స్పీక‌ర్.. అధికార‌పార్టీ నేత‌గా మారార‌ని ఆరోపించారు. త‌ల‌సాని రాజీనామాపై తెలంగాణ రాజ‌కీయ జేఏసీ నేత కోదండ‌రాం.. ప్రెస్ అకాడ‌మీ ఛైర్మ‌న్ అల్లం నారాయ‌ణ స్పందించాల‌ని డిమాండ్ చేశారు. త‌ల‌సాని రాజీనామాపై గండ్ర బ‌య‌ట‌పెట్టిన వివ‌రాలు తెలంగాణ అధికార‌ప‌క్షంలో క‌ల‌క‌లాన్ని రేపుతున్నాయి.
Tags:    

Similar News