టీటీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. తాజాగా తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పు పడుతున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ అధికారపక్షంలోకి వెళ్లటం.. అలా వెళ్లిన వారిని తెలంగాణ అధికారపక్ష అనుబంధ సభ్యులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
దీనిపై రేవంత్ స్పందిస్తూ.. స్పీకర్ తీసుకున్న నిర్ణయం తప్పని చెబుతున్నారు. ఆయనపై తాము న్యాయపోరాటానికి దిగుతామని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ స్పీకర్ తీసుకున్న నిర్ణయం చట్ట ఉల్లంఘన అవుతుందని.. టీటీడీపీ ఎమ్మెల్యేల విలీనానికి సంబంధించిన అంశం స్పీకర్ పరిధిలో లేదని.. అదంతా కేంద్ర ఎన్నికల సంఘం తీసుకోవాల్సిన నిర్ణయంగా ఆయన చెబుతున్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉన్న నిర్ణయాన్ని స్పీకర్ ఏ విధంగా తీసుకుంటారని ప్రశ్నించి రేవంత్.. అలా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టులో కొట్టేస్తారని.. గతంలో ఇలాంటి అంశాల్లో కోర్టు తీర్పులు ఇదే తీరులో ఉన్నట్లు ఆయన స్పష్టం చేస్తున్నారు. మరి.. రేవంత్ రెడ్డి వాదన ఎంతవరకు నిజమన్నది కాలమే డిసైడ్ చేయాలి.